ఘనంగా హోమియో దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా హోమియో దినోత్సవం

Apr 11 2026 9:28 AM | Updated on Apr 11 2026 9:28 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భవన్‌లో ప్రపంచ హోమియో దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయుష్‌ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఉదయం 6 గంటలకు యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ఆయుర్వేద యునాని హోమియోలకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులను పరీక్షించి అవసరమైనవారకి ఉచితంగా మందులు అందించారు. కార్యక్రమంలో నోడల్‌ అధికారి డాక్టర్‌ నారాయణ, డి ఎం హెచ్‌ ఓ డాక్టర్‌ రాజేందర్‌, హోమియో వైద్యులు డాక్టర్‌ రాంప్రసాద్‌, సంతోషి, తిరుమల, ఆయుర్వేద వైద్యులు స్వప్న, వైష్ణవి, శ్వేత, మనీష, యునానీ వైద్యులు నిలోఫర్‌ అంజుమ్‌, డిస్ట్రిక్‌ ప్రోగ్రాం మేనేజర్‌ శ్రావణ్‌, ఫార్మసిస్టులు నర్సారెడ్డి, ప్రకాశ్‌, రమణ, వెంకటేశ్‌, విజయ్‌ ఆయుష్‌ సిబ్బంది, యోగా శిక్షకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement