ఉపాధి కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి

Apr 11 2026 9:28 AM | Updated on Apr 11 2026 9:28 AM

పెంబి: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్డీవో విజయలక్ష్మి సూచించారు. మండలంలోని మందపల్లి గ్రామంలో కొత్త చెరువు ప్రాంతంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను శుక్రవారం పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. కూలీల ఫొటోలు అప్‌లోడ్‌ చేయడంలో పెంబి మండలం వెనుకబడి ఉందని, త్వరత్వరగా కూలీల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని ఏపీవో ఎఫ్‌ఏలకు సూచించారు. అనంతరం మండల కేంద్రానికి వెళ్లారు. ఇటీవల భారత్‌ గౌరవ్‌రత్న శ్రీ సమ్మాన్‌ అవార్డ్‌ అందుకున్న డీఆర్డీవోను ఎంపీడీవో కార్యాలయంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు స్వప్నీల్‌రెడ్డి, నాయకులు శంకర్‌, భూమేశ్‌ సత్కరించారు. కార్యాక్రమంలో మందపల్లి సర్పంచ్‌ బైరెడ్డి రజిత, ఏపీవో రాజశేఖర్‌, ఎఫ్‌ఏలు భూమన్న, గోపి, నాయకులు రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement