నిర్మల్‌చైన్‌గేట్: ది తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా జిల్లా కేంద్రానికి చెందిన సాదం అరవింద్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని కెమిస్ట్ భవన్‌లో ఆయనను సత్కరించి ధ్రువీకరణ పత్రం, మెమొంటో అందించారు. అనంతరం అరవింద్ మాట్లాడుతూ టీటీసీడీఏ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కడంతో బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. కెమిస్ట్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో టీటీసీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన సలహాదారు జనార్దన్, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు.


