విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

నిర్మల్‌టౌన్‌: విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించామని షీ టీం పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులకు సైబర్‌ నేరాలు, ఈవ్‌టీజింగ్‌, సోషల్‌ మీడియా వినియోగంపై శుక్రవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొబైల్‌, సోషల్‌ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్‌ దాడులు ఎలా జరుగుతున్నాయో, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 100/112 నంబర్లకు కాల్‌ చేయాలని తెలిపారు. సైబర్‌ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఉపయోగించుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement