నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

● ఉత్సాహంగా పరీక్ష రాసిన గ్రామీణ మహిళలు ● మంచి ఫలితాలు వస్తాయంటున్న బోధకులు శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

డిగ్రీ పరీక్షల్లో సంస్కరణలు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ వెంకటయ్య వెల్లడించారు.

మొక్కజొన్న పంట దగ్ధం

జిల్లాలోని వివిధ మండలాల్లో శుక్రవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి పలువురు రైతులకు చెందిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది.

సాంకేతిక పరిజ్ఞానంతో

మెరుగైన సేవలు

భైంసాటౌన్‌: సాంకేతిక పరిజ్ఞానంతో అంగన్‌డీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించాలని ఎ మ్మెల్యే పి.రామారావుపటేల్‌ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం అంగన్‌వాడీ టీచర్లకు నూతన స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడు తూ.. పోషణ్‌ అభియాన్‌లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బా లింతలకు అందిస్తున్న పోషకాహారం, ఇతర వి వరాలు ఎప్పటికప్పుడు మొబైల్‌ ఫోన్‌ యాప్‌ లో నమోదు చేసేందుకు ప్రభుత్వం కొత్త మోబై ల్‌ ఫోన్లు అందించిందన్నారు. కార్యక్రమంలో భైంసా సీడీపీవో సరిత, అంగన్‌వాడీ టీచర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నిర్మల్‌: వచ్చే విద్యాసంవత్సరం కూడా జిల్లాలో ఉన్నతవిద్య అందని ద్రాక్షే. ఈసారి కూడా పీజీ కోసం పట్నం బాట పట్టాల్సిందే. సీఎం యూనివర్సిటీ ప్రకటించి మూడునెలలవుతున్నా.. జిల్లాలో ఏర్పాటుపై ఎలాంటి కదలిక లేదు. అసలు.. ఏర్పాటు చేస్తారా, లేదా అనేదానిపైనా స్పష్టత కొరవడింది. జిల్లాకేంద్రంలో కాకతీయ యూనివర్సిటీ పీజీకాలేజీ కథేంటో, క్లాసులు ఎక్కడ నడుస్తున్నాయో.. ‘వరంగల్‌’వాళ్లకే తెలియాలి. జిల్లాలో ఏటా కనీసం 4 వేల మంది విద్యార్థులు డిగ్రీ పూర్తిచేసుకుంటున్నారు. వీరిలో 500లోపు మంది మాత్రమే పీజీ పూర్తిచేస్తున్నారు. వీరు కూడా ఉన్నతవిద్య కోసం హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌వంటి దూరప్రాంతాలకు వెళ్తున్నారు. మిగిలిన విద్యార్థులు డిగ్రీ పాసైనా అందుబాటులో ఉన్నతవిద్య లేక ఇంటివద్దే ఉపాధి, ప్రైవేటు ఉద్యోగాలు చూసుకుంటున్నారు.

యూనివర్సిటీ.. స్పష్టత ఏదీ..!?

త్వరలోనే బాసర ట్రిపుల్‌ఐటీలోనే యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని జనవరిలో నిర్మల్‌సభలో సీఎం ప్రకటించారు. మూడు నెలలు కావొస్తున్నా.. ఈ ప్రకటనకు సంబంధించి ఎలాంటి కదలిక కనిపించడం లేదు. పాలకులు, అధికార పార్టీ నేతల నుంచి ఎలాంటి ప్రకటనలూ రావడం లేదు. జిల్లా అధికారుల నుంచీ ఎటువంటి చొరవ లేకపోవడం గమనార్హం. వచ్చే విద్యాసంవత్సరంలోనైనా విశ్వవిద్యాలయం పనులు మొదలవుతాయని విద్యార్థులు, జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు.

ఇంటిపట్టునే ఆడపిల్లలు..

రాష్ట్రంలోని చాలా డిగ్రీ కాలేజీల్లోనే పీజీ కోర్సులూ కొనసాగుతున్నాయి. జిల్లాలో ఉన్న పీజీకాలేజీ మూతపడింది. దేశంలోనే పేరున్న కాకతీయ విశ్వవిద్యాలయం జిల్లాకు మాత్రం అన్యాయం చేస్తోంది. దగ్గరలో అంటే నిజామాబాద్‌, డిచ్‌పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ ఉంది. బస్సుల్లో పోయిరావడం ఇబ్బందికరమే. ఈనేపథ్యంలో మంచిమార్కులతో డిగ్రీ పూర్తిచేసినా.. జిల్లాలో చాలామంది ఆడపిల్లలు ఇంటిపట్టునే ఉంటున్నారు. చదవాలన్న తపన ఉన్నా.. స్థానికంగా ప్రైవేటు ఉపాధి, ఉద్యోగాలు చూసుకోవాల్సిన దుస్థితి.

తీరని గ్యాస్‌ కష్టాలు!

ఎన్నాళ్లీ.. నిర్లక్ష్యం..!?

ప్రజల అమాయకత్వమా..!? నాయకుల అవగాహన లోపమా..!? పాలకుల నిర్లక్ష్యమా..!? అధికారుల పట్టింపులేనితనమా..!? ఏది ఏమైతేనేం.. ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారాల్సిన జిల్లా.. ఉన్న కాలేజీలు, కోర్సులు పోయి ఖాళీ అవుతోంది. కొత్త యూనివర్సిటీ జిల్లాలో పెడతారా, పక్కనున్న ఆదిలాబాద్‌కు ఇస్తారా..! ఇప్పటికీ తేలడం లేదు. దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు, స్పష్టత తీసుకుందామన్న పట్టింపు ఉన్నవారూ కనిపించడం లేదు. చదువుల తల్లి కొలువైన జిల్లాలో విద్యావ్యవస్థ విషయంలో చిన్నచూపు ఉండటంపై జిల్లావాసులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. స్థానిక పాలకులు, అధికారులు, అన్నివర్గాల్లో సరైన చైతన్యం లేనికారణంగానే ఈ దుస్థితి ఉందని విద్యావంతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement