ఉల్లాస్‌తో అక్షర వెలుగు | - | Sakshi
Sakshi News home page

ఉల్లాస్‌తో అక్షర వెలుగు

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

లక్ష్మణచాంద: గ్రామీణ ప్రాంత మహిళల్లో అక్షరాస్య త పెంపు లక్ష్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ, వయోజన విద్యాశాఖలు సంయుక్తంగా ’ఉల్లాస్‌’ (అండర్‌స్టాండింగ్‌ ఆఫ్‌ లైఫ్‌లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ(ULLAS) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా నిరక్షరాస్యులుగా ఉన్న స్వయంసహాయక సంఘాల(డ్వాక్రా) మహిళలను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్నారు. అక్షరాస్యత శాతాన్ని గణనీయంగా పెంచే ఈ ’ఉల్లాస్‌’ కార్యక్రమం గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. వయసుతో సంబంధం లేకుండా చదువు నేర్చుకునే ఈ మహిళలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఇటీవల పరీక్షలు

జిల్లాలోని 19 మండలాలు, 400 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 18,339 మంది నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి వారికి పాఠాలు బోధించారు. ఉల్లాస్‌ కార్యక్రమం ద్వారా డ్వాక్రా సంఘాల మహిళలు నేర్చుకున్న పాఠ్యాంశాలపై మార్చి 29న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 17,824 మంది మహిళలు హాజరయ్యారని అధికారులు తెలిపారు.

54 మార్కులు వస్తే పాస్‌..

ఉల్లాస్‌ పరీక్షలో ప్రధానంగా మూడు సబ్జెక్టులకు 150 మార్కుల పేపర్‌ను రూపొందించారు. చదవడం 50 మార్కులు, రాయడం 50 మార్కులు, గణితం 50 మార్కుల చొప్పున కేటాయించారు. మొత్తం 150 మార్కులకు కనీసం 54 మార్కులు సాధిస్తే ఆ మహిళలు ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. ఈ సరళమైన అర్హత ప్రమాణం ద్వారా ఎక్కువ మంది మహిళలు విజయం సాధించే అవకాశం ఉంది.

ఉల్లాస్‌ కార్యక్రమం లక్ష్యాలు

ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళలు కేవలం అక్షరాస్యులుగా మారడమే కాకుండా, ఆర్థికంగా, సామాజికంగా కూడా సాధికారత సాధించే అవకాశం కలుగుతుంది. అక్షరాస్యత సాధించడం ద్వారా బ్యాంకు లావాదేవీలు స్వయంగా నిర్వహించగలుగుతారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా పొందుతారు. కుటుంబ ఆరోగ్య, విద్యా విషయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. డిజిటల్‌ సేవలను వినియోగించుకుంటారు.

జిల్లా సమాచారం..

త్వరలో రెండోదశ..

మొదటి దశ తరగతులు విజయవంతంగా పూర్తి కావడంతోపాటు, పరీక్షలు కూడా స జావుగా నిర్వహించడంతో ఇప్పుడు రెండో దశ తరగతులను మే లేదా జూన్‌ నెలల్లో ప్రారంభించడానికి అధికారులు చర్యలు చే పడుతున్నారు. తొలి దశ తరగతుల నిర్వహణ సమయంలో పుస్తకాలు ఆలస్యంగా రావ డం, మధ్యలో ఎన్నికలు జరగడం వంటి కా రణాల చేత తరగతులకు కొంత అంతరా యం ఏర్పడింది. అయితే, రెండోదశ తరగతులను మాత్రం పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ దశలో శిక్షణ పొందే మహిళలకు సెప్టెంబర్‌ నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement