అవగాహన లేకుండా వ్యతిరేకిస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

అవగాహన లేకుండా వ్యతిరేకిస్తున్నారు

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

వాతావరణం ● బీజేపీ ధర్నాపై కాంగ్రెస్‌ కౌన్సిలర్ల విమర్శలు

వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి అధికంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

నిర్మల్‌ టౌన్‌: బీజేపీ నాయకులు నిర్మల్‌ పట్టణంపై అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం సరికా దని కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు అన్నారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేయడాన్ని తప్పు పట్టారు. తమ ఉనికి కాపాడుకునేందుకే ధర్నా చేశారని విమర్శించారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. ముఖ్యమంత్రి కేటాయించిన రూ.15 కోట్ల ప్రత్యేక నిధులపై బీజేపీ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఈ నిధులు ఎమ్మెల్యే చొరవతో మంజూరు కాలేదని, అన్ని మున్సిపాలిటీలకు కేటాయించారని తెలిపా రు. గతంలో వార్డుల సమస్యలపై అవగాహన లేకుండా కేటాయించారన్నారు. అందుకే ఆ టెండర్లను రద్దుచేసి, వార్డు అవసరాన్ని బట్టి కేటాయించా లని పాలకవర్గం నిర్ణయించిందని తెలిపారు. అమృత్‌–2లో నిర్మల్‌కు నిధులు కేటాయించడంలోనూ ఎమ్మెల్యే ప్రమేయం లేదన్నారు. లక్షకు పైగా జనా భా ఉన్న వాటిని అమృత్‌–1లో, 90 వేల జనాభా ఉన్న అన్ని మున్సిపాలిటీలను అమృత్‌–2లో కేంద్రం గుర్తించిందని తెలిపారు. నిర్మల్‌ పట్టణాన్ని అభివృద్ధిలో ముందుంచాలనే లక్ష్యంతో కొత్తపాలకవర్గం పనిచేస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు కత్తి నరేందర్‌, చెనిగారపు నరేశ్‌, గోపు గోపి, ఎస్పీ.రాజు, లక్కాకుల హరీశ్‌, నాయకులు రాఘవేంద్రచారి, అడప పోశెట్టి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement