జిల్లాలో ఏర్పాటు చేస్తామని ప్రకటించిన యూనివర్సిటీని త్వరలోనే ప్రారంభించాలి. జిల్లా విద్యార్థులకు ఉన్నతవిద్యను అందుబాటులోకి తీసుకురావాలి.
– వెంకటేశ్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు
నిర్మల్‌పై నిర్లక్ష్యం వీడాలి..
చదువులతల్లి కొలువైన నిర్మల్ జిల్లాలో ఉన్న పీజీకాలేజీని దూరం చేశారు. యూనివర్సిటీని ప్రకటించి, ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. జిల్లాపై చిన్నచూపు చూడొద్దు.
–కై రి శశి, ఏబీవీపీ విభాగ్ కన్వీనర్
చదువుకు దూరమవుతున్నారు..
జిల్లాలో ఉన్నతవిద్య అందుబాటులో లేకపోవడంతో చాలామంది డిగ్రీ విద్యార్థులు పైచదువులకు దూరమవుతున్నారు. ప్రధానంగా విద్యార్థినులకు ఉన్నతవిద్య అందడం లేదు.
–కై లాశ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి
ఇప్పటికై నా దృష్టిపెట్టాలి..
బాసర ట్రిపుల్‌ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని నిర్మల్ సభలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు జిల్లాలో కొత్తకోర్సులు వచ్చేలా దృష్టిపెట్టాలి.
– దిగంబర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి


