నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో మొక్కజొన్న, జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు కోరారు. ఈమేరకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలో మొక్కజొన్న పంటను విస్తారంగా రైతులు సాగు చేశారని, పంట చేతికి వచ్చినా కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్పందించిన మంత్రి మొదటి విడతగా నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జొన్న కొనుగోళ్లు ఎక్కడా ప్రారంభించలేదని, త్వరలోనే నిర్మల్ జిల్లాలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దీతో రైతుల పక్షాన మంత్రికి శ్రీహరిరావు కృతజ్ఞతలు తెలిపారు.


