నిర్మల్ టౌన్: పట్టణ అభివృద్ధికి మంజూరైన రూ. 15 కోట్లకు సంబంధించి పాత టెండర్లు రద్దు చేయడాన్ని నిరసిస్తూ.. మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదా లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కృషి ఫలితంగానే నిర్మల్ పట్టణాన్ని అమృత్ పథకంలో చే ర్చారని గుర్తు చేశారు. ఈ మేరకే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ పథకం కింద మొదటగా రూ.62.50 కోట్లు పట్టణంలో తాగునీటి సౌకర్యానికి మంజూరైనట్లు తెలిపారు. అలాగే మురికి నీటిశుద్ధి కోసం ఎస్‌టీపీ(సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.42 కోట్లు మంజూరైనట్లు వివరించారు. పట్టణ అభివృద్ధికి అత్యవరంగా రూ.50 కోట్లు అవసరమని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తే రూ.15 కోట్లు మంజూరు చేశారన్నారు. మున్సిపల్ పాలకవర్గం అభివృద్ధిని అడ్డుకునేలా టెండర్ రద్దు నిర్ణయాన్ని తక్షణ మే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, సీనియర్ నాయకులు మెడిసెమ్మ రాజు, పట్టణ బీజేపీ కౌన్సిలర్లు సాదం అరవింద్, గంజి రాజు, శ్రీరామోజీ నరేశ్, శాంశంక్, ఖమ్మం సురేందర్, జింక సూరి, సాత్విక్, సూరజ్ నాయక్, విఠల్, డా.కృష్ణ మోహన్, ముత్యం, ఈశ్వర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


