అధికారికంగా గుర్తించరా? | - | Sakshi
Sakshi News home page

అధికారికంగా గుర్తించరా?

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

● ప్రాణత్యాగాలనూ పట్టించుకోరా? ● అడవిబిడ్డల చరిత్ర కనుమరుగేనా? ● ఎవరికీ పట్టని ‘వెయ్యిఉరుల మర్రి’ ● ఆదివాసీలకే పరిమితం చేసిన నేతలు ● నేడు రాంజీగోండు సేవాసమితి ఆధ్వర్యంలో రాంజీ, వెయ్యిమంది అమరుల వర్ధంతి 8లోu గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

నిర్మల్‌

మునగ సాగు.. లాభాలు బాగు

ఒక్క పంట సాగు చేయడమే కష్టమైన ఈ రోజు ల్లో ఓ రైతు ఏకంగా నాలుగు రకాలు సాగు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. లాభాలు గడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

భైంసాలో పోలీస్‌ ప్రజావాణి

భైంసాటౌన్‌: పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజావాణి నిర్వహించారు. ఎస్పీ జానకీ షర్మిల హాజరై భైంసా డివి జన్‌ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 13మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించి, పరిష్కరించా లని సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు సూచించా రు. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం ఏ ర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. అనంతరం పెండింగ్‌ ఫిర్యాదుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నిర్మల్‌: తెలంగాణకే తలమానికంగా నిలిచే ఘనమైన చరిత్రను మరుగున పడేస్తున్నారు. ‘గిరి’వీరు ల అసమాన పోరాటాలు, అడవి బిడ్డలు చేసిన ని రూపమాన త్యాగాలను పట్టించుకోవడం లేదు. ని ర్మల్‌గడ్డపై ఆంగ్లేయ–నైజాం సైన్యాలతో పోరాడిన రాంజీ సహా వెయ్యిమంది అమరవీరులకు ఇప్పటికీ సరైన గుర్తింపు లేదు. కనీసం.. ప్రభుత్వాలు అధికా రికంగా నివాళులు అర్పించకపోవడం దారుణం. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఏం ప్రయోజనం లేదన్న వాదన వస్తోంది. చిన్నచిన్న వాటిని పట్టించుకునే వారికి.. ఇంతటి త్యాగాలచరిత్ర ఎందుకు పట్టడం లేదన్న ప్రశ్న అందరి నోటా వినిపిస్తోంది.

ఎందుకు గుర్తించడం లేదు?

చిన్నచిన్న ఘటనలు, గల్లీనేతలను గుర్తిస్తూ.. వర్ధంతులు, జయంతులను ఘనంగా నిర్వహిస్తున్న పా లకులు ఇలాంటి అమరవీరులను ఎందుకు గుర్తించడం లేదన్న ప్రశ్న ఏళ్లుగా జిల్లా అడుగుతూనే ఉంది. పేరు కోసం ఉత్సవాలు చేసే అధికారులు ఇంతటి ప్రాణత్యాగాలను ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శిస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో రాంజీసహా వెయ్యిమంది అమరులకు నివాళులర్పించడం కేవలం ఆదివాసుల పనే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించాల ని, కనీసం నివాళులర్పించాలని ఆదివాసీ సంఘాలు, యువజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా.. అధి కారులు, పాలకులు కనీసం పట్టించుకోవడం లేదు.

నేడు అమరవీరుల వర్ధంతి

రాంజీగోండు సహా వెయ్యిమంది అమరవీరులు అసువులు బాసిన ఏప్రిల్‌ 9న ఎవరు వచ్చినా, రాకున్నా.. ఆదివాసులు మాత్రం వారికి నివాళులర్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని చైన్‌గేట్‌ వద్ద ఉన్న రాంజీగోండు విగ్రహం నుంచి ఎల్లపల్లి దారిలో గల అమరుల స్తూపందాకా సంప్రదాయ వాయిద్యాలతో వెళ్తున్నారు. తమదైన పద్ధతితో ఆ వీరులకు అశ్రునివాళుల ర్పిస్తున్నారు. ఈసారి కూడా అమరవీరుల స్తూపం వద్ద వర్ధంతి కార్యక్రమం ఉంటుందని రాంజీగోండు సేవాసమితి నిర్వహణ కమిటీ చైర్మన్‌ నైతం భీమ్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ సోయం బాపూరావు వస్తారని, జిల్లావాసులు అధికసంఖ్యలో హాజరై అమరవీరులకు నివాళులర్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement