లక్ష్మణచాంద: వీబీ జీ రామ్ చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బర్కుంట గంగారాం డిమాండ్ చేశారు. సోన్ మండలంలోని కడ్తాల్, సాకెర గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రోజుకు రెండుసార్లు కూలీల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయడానికి సిగ్నల్స్ రాక అనేక గ్రామాల్లో పనులు చేయలేయలేపోతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని కూలీలకు పిలుపునిచ్చారు.


