బాసర: బాసరలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఏర్పాట్లు, అభివృద్ధి ప నులపై బుధవారం ఆలయ అతిథి గృహంలో రాష్ట్ర చీఫ్ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిషనర్ జోగారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించా రు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులు ప్రణాళి కాబద్ధంగా, సమయానికి పూర్తయ్యేలా చూడాలని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, తా గునీరు, పారిశుద్ధ్యం, రవాణా ఏర్పాట్లపై ప్ర త్యేక దృష్టి సారించాలని సూచించారు. పంచా యతీరాజ్, దేవాదాయ, మిషన్ భగీరథ, సాగునీటి శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


