అందుబాటులోకి ‘క్రిటికల్‌ కేర్‌’ | - | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి ‘క్రిటికల్‌ కేర్‌’

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● జిల్లా జనరల్‌ ఆస్పత్రి తనిఖీ

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా ప్రజలకు త్వరలోనే క్రిటికల్‌ కేర్‌ విభాగం సేవలు అందుబాటులోకి రానున్నట్లు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ తెలిపారు. బుధవారం జిల్లా జనరల్‌ ఆస్పత్రి ప్రాంగణంలో చివరిదశలో నిర్మాణంలో ఉన్న అత్యవసర వైద్యసేవల విభాగా న్ని తనిఖీ చేశారు. ఆస్పత్రి భవన నిర్మాణ మ్యాపులను సంబంధిత అధికారులు కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పనుల వివరాలు, పూర్తి కావాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్సల గదులు, డ యాలసిస్‌ కేంద్రం, ఐసీయూ గైనిక్‌ విభాగం, ఎలక్ట్రికల్‌ యూనిట్‌, ఫైర్‌ సేఫ్టీ విభాగాలు పరిశీలించారు. మిగతా పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తేవాలని సూచించా రు. అనంతరం సమీపంలోని యూడీఐడీ (సదరం) కేంద్రం, డ్రగ్స్‌ డీ అడిక్షన్‌ సెంటర్లు పరిశీలించారు. ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిని తనిఖీ చేసి అత్యవసర వైద్య సేవల విభాగం, రక్త నిల్వల గదిని పరిశీ లించి రిజిస్టర్లు చూశారు. బ్లడ్‌ బ్యాంక్‌ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. రికార్డుల్లో ఇంతకుముందు బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా రక్తం పొందిన వారికి ఫోన్‌ చేసి వివరాలు సరిపోల్చారు. రికార్డులు, రసీదులు పకడ్బందీగా నిర్వహించాలని, వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సీవీ శారద, తహసీల్దార్‌ రాజు, అధికారులు పాల్గొన్నారు.

బస్తీ దవాఖానా తనిఖీ

అంతకుముందు పట్టణంలోని గుల్జార్‌ మార్కెట్‌ ప్రాంతంలోగల బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని రకాల రిజిస్టర్లను పరిశీలించారు. రోగులకు సేవా దక్పథంతో వైద్యం అందించాలని, ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్‌, అధికారి సౌమ్య, స్థానిక కౌన్సిలర్‌ తౌహిదుద్దీన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement