టీచర్ల పారితోషికం ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

టీచర్ల పారితోషికం ఇప్పించండి

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

భైంసాటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ఉపాధ్యాయులకు గౌరవ పారితోషికం చెల్లించాలని ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్‌ వెంకట్రావు కోరారు. పట్టణంలోని సబ్‌కలెక్టర్‌ కా ర్యాలయంలో బుధవారం అజ్మీర సంకేత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులతో వెట్టి చాకి రి చేయిస్తోందన్నారు. పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం పారితోషికంతోపాటు కులగణన పారితోషికం సైతం చెల్లించలేదని వాపోయారు. కా ర్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేశ్‌నాయ క్‌, ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మాజీ చందనే, సునీల్‌, భూక్యా సుభాశ్‌, మల్లయ్య, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement