‘మహాలక్ష్మి’ని సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘మహాలక్ష్మి’ని సద్వినియోగం చేసుకోవాలి

Apr 1 2026 7:24 AM | Updated on Apr 1 2026 7:24 AM

నిర్మల్‌టౌన్‌: ప్రభుత్వ పథకాలను మహిళలు వినియోగించుకోవాలని నిర్మల్‌ డిపో మేనేజర్‌ పండరి అన్నారు. బస్టాండ్‌లో మంగళవారం మహిళా ప్రయాణికులను సన్మానించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 290 కోట్ల ప్రయాణికులు ఉచిత ప్రయాణం పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. సామాన్య, మధ్యతరగతి మహిళలు, విద్యార్థినులు, కూలీలు వినియోగించుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నవీన్‌కుమార్‌, ఏఎంవీఐ ఆసిఫ్‌, మహిళా సమాఖ్య కార్యదర్శి కట్ల లక్ష్మి, ప్రయాణికులు రాధిక, ప్రసన్న, స్రవంతి, ప్రీతి సుందర్‌, బస్‌స్టేషన్‌ మేనేజర్‌ వీజీ.రెడ్డి, డీసీఎన్‌ఆర్‌.శేఖర్‌, టీవీ.రమణ, ఉద్యోగులు, ప్రయాణికులు పాల్గొన్నారు.

ఇంటర్న్‌షిప్‌ పథకానికి దరఖాస్తుల స్వీకరణ

నిర్మల్‌ఖిల్లా: యువతకు ప్రయెగాత్మక అనుభవం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం కింద మూడో విడతకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నర్సింహారెడ్డి తెలిపారు. ఇంటర్న్‌షిప్‌ కాలవ్యవధి 6 నెలలు నుంచి 9 నెలల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ప్రతీనెల రూ.9 వేల స్టైఫండ్‌ అందించనున్నారు. ప్రమాదబీమా యోజన, సురక్ష బీమా వంటి సదుపాయాలు కూడా కల్పించనున్నారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. పదో తరగతి, 12వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.12 లక్షలలోపు ఉండాలన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన మార్క్స్‌ మెమోలుprimeministerintern shipportal ద్వారా అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 1800 11 6090 టోల్‌ ఫ్రీ నంబర్‌ను లేదా జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement