చెడగొట్టు వాన.. | - | Sakshi
Sakshi News home page

చెడగొట్టు వాన..

Apr 1 2026 7:24 AM | Updated on Apr 1 2026 7:24 AM

బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

అర్ధరాత్రి తర్వాత ఈదురు గాలులతో బీభత్సం నేలవాలిన వరి, మొక్కజొన్న, జొన్న, నువ్వు పంటలు రాలిన మామిడి రైతుల ఆశలు విరిగిన విద్యుత్‌ స్తంభాలు.. నిలిచిన సరఫరా

నిర్మల్‌

‘పోలీస్‌ అక్క’కు జాతీయ గుర్తింపు

సమష్టి కృషితో పోలీస్‌ అక్క కార్యక్రమానికి జాతీయస్థాయి గుర్తింపు లభించిందని ఎస్పీ జా నకీషర్మిల అన్నారు. జిల్లా కార్యాలయంలో మంగళవారం సంబురాలు నిర్వహించారు.

నర్సాపూర్‌(జి)/లక్ష్మణచాంద/దిలావర్‌పూర్‌/సాక్షి ఫొటోగ్రాఫర్‌ నిర్మల్‌: మామిడి పంట విరగ కాసింది.. పసుపు చేతికి వచ్చింది.. మొక్కజొన్న కోతలు మొదలయ్యాయి. జొన్న వారం పది రోజుల్లో చేతికి రానుంది. వరి, నువ్వు పంటలు ఆశాజనకంగా ఉ న్నాయి. జిల్లా రైతుల యాసంగి దిగుబడులపై సంతోషంగా ఉన్నారు. అర్ధరాత్రి దొంగలా వచ్చిన చెడగొట్టువాన అన్నదాత ఆశలు ఆవిరి చేసింది. జిల్లాలోని కుంటాల, లోకేశ్వరం, లక్ష్మణచాంద, సోన్‌, నర్సాపూర్‌(జి), నిర్మల్‌ రూరల్‌, మామడ, పెంబి, దిలావర్‌పూర్‌ తదితర మండలాల్లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి పంటలన్నీ నేలవాలాయి. వి ద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. నర్సాపూర్‌ (జి) మండల కేంద్రంతోపాటు గొల్లమాడ, కుస్లి, రాంపూర్‌, చాక్‌ పల్లి , టెంబరేణి , అర్లి(కె), నందన్‌, బామ్ని(బి), తిమ్మాపూర్‌(జి) గ్రామాల్లో అకాల వర్షానికి మొక్కజొన్న, జొన్న పంటలు దెబ్బతిన్నా యి. గొల్లమాడలో చేతన్‌రావు అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల మామిడి తోటలో కాయలు నేలరాలా యి. లక్ష్మణచాంద మండలంలో అకాల వర్షానికి మొక్కజొన్న, నువ్వు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, ఉడికించిన పసుపు తడిశాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ల కోరుతున్నారు. నిర్మల్‌ రూరల్‌ మండలం ముఠాపూర్‌లో ఈదురుగాలులకు మామిడి కాయలు నేలరాలాయి. సోన్‌ మండలంలో మొక్కజొన్న, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబెట్టిన పసుపు కొమ్ములు తడిశాయి. దిలావర్‌పూర్‌తోపాటు న్యూలోలం, సిర్గాపూర్‌, బన్సపల్లి, కాల్వ తదితర గ్రామాల్లో సోమవారం అర్థ్రరాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జామున వరకు బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. అన్నదాతను నిండా ముంచింది. మొక్కజొన్న, జొన్న, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. గాలికి రైస్‌మిల్‌ కాంపౌండ్‌ వాల్‌ కూలింది. మండలంలో 3 వేల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతిన్నాయి.

ముధోల్‌ నియోజకవర్గంలో..

కుంటాల/ముధోల్‌/లోకేశ్వరంతానూరు/కుభీర్‌: కుంటాల మండలం ఓలా, కుంటాల, కల్లూరు, అంబకంటి, అందకూర్‌, లింబా(కె), లింబా(బి) గ్రామాల్లో ఈదురు గాలులకు మామిడికాయలు, చింతకాయలు నేలరాలాయి. మెదన్‌ పూర్‌, దౌనెల్లి,కుంటాల, అందకూర్‌, ఓలా గ్రామాల్లో విద్యుత్‌ తీగలు తెగిపడిపోయాయి. అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏఈ మధుకర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది మరమ్మతులు చేసి సరఫరా పునరుద్ధరించారు. లోకేశ్వరం మండలం జోహర్‌ఫూర్‌, అబ్దుల్లాపూర్‌, రాయపూర్‌కాండ్లీ,ఽ ధర్మోరా, పంచగుడి, పిప్రి, వట్టోలి, సాథ్‌గాం, సెవాలాల్‌తండా, రాజూ ర, అర్లిగొడిసెరా, నగర్‌, గడ్‌చాంద, పుస్పూర్‌ గ్రామాల్లో ఈదురు గాలుల వర్షానికి జొన్న, వరి, మొక్కజొన్న, నువ్వు పంటలు నేలవాలాయి. మిర్చి, నూవ్వు, వరి, పొద్దుతిరుగుడు, మామిడి, సజ్జ పంటలు దెబ్బతిన్నాయి. రాజూర–మన్మద్‌ రోడ్డుపై చెట్టు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకల కు అంతరాయం కలిగింది. మొహళ గ్రామ సమీ పంలోని విద్యుత్‌ స్తంభాలు విరిగాయి. కల్లాల్లో అరబెట్టిన మొక్కజొన్నలు తడిశాయి. ముధోల్‌ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. మండల కేంద్రంలోని బాబాషఫీ అల్లాఖాన్‌ మామిడి తోటలో కాయలు రాలాయి. దీంతో రూ.1.50 లక్షల నష్టం వచ్చిందని బాధితుడు తెలిపాడు. ముధోల్‌లోని కంటి ఆసుపత్రి సమీపాన భారీ వృక్షం రోడ్డు పడడంతో, రాకపోకలకు అంతరాయం కలిగింది. తానూ రు మండలంలో వర్షానికి కొతకు వచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. భోసి, బామ్ని, మహలింగి, తానూరు, ఝరి(బి), బెంబర, హిప్నెల్లి, బోరిగాం, ఉమ్రి(కె), హంగిర్గా, దాగాం, వడ్‌గాం, బోల్సా, జౌలా(కె), కళ్యాణి గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కుభీర్‌ మండలంలో ఈదురుగాలుల వానకు 1,200 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్నపంట నేలవాలి తీవ్రం నష్టం జరిగింది.

రాజూర–మన్మద్‌ రహదారిపై విరిగి పడ్డ చెట్టు

ఖానాపూర్‌ నియోజవర్గంలో..

ముఠాపూర్‌లో నేలరాలిన మామిడి కాయల వద్ద రైతులు

రాజాపూర్‌లో నేలవాలిన జొన్న చేనులో రైతు గజేందర్‌

చామన్‌పల్లిలో వాలిన నువ్వు పంటను చూపుతున్న రైతు

మందపల్లిలో అకాల వర్షానికి తడిసిన పసుపు పంట

పెంబి/కడెం/ఖానాపూర్‌/దస్తురాబాద్‌: కడెం మండలం సారంగపూర్‌, ఎలగడప గ్రామల్లోని వర్షానికి మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. ప్రభుత్వం అదుకోవాలని రైతు నాయకుడు హపవత్‌ రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఖానాపూర్‌ మండలంలో మొక్కజొన్న, మామి డి రైతులకు అకాల వర్షం తీవ్రంగా నష్టం మిగి ల్చింది. పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు కూడా కొట్టుకుపోయాయి. విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. అధికారులు మరమ్మతులు చేశారు. దస్తురాబాద్‌ మండలంలో అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. దేవునిగూడెం, దస్తురాబాద్‌, ఆకొడపేట, రేవోజీపేట, మున్యా ల, గోడిసిర్యాల, పెర్కపల్లె గ్రామాల్లో మొక్కజొన్న, మామిడి రైతులకు అపార నష్టం వాటిల్లింది. పెంబి మండలంలోని గాలివాన బీభత్సానికి నువ్వు, మొక్కజొన్న పంటలు నెలవాలాయి. మామిడి కాయలు రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరబెట్టిన పసుపు పంట తడిసిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement