నిర్మల్‌ బడ్జెట్‌ రూ.30.26 కోట్లు | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ బడ్జెట్‌ రూ.30.26 కోట్లు

Apr 1 2026 7:24 AM | Updated on Apr 1 2026 7:24 AM

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ మున్సిపల్‌ నూతన పాలకవర్గం కొలువుదీరిన తర్వాత తొలి బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.30.26 కోట్ల అంచనాతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం కౌన్సిల్‌ సమావేశం వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి అధ్యక్షతన జరిగింది. ఆయన 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రూ.6.93 కోట్లుగా, పన్నేతర ఆదాయం 14.14 కోట్లుగా చూపించారు. డిపాజిట్ల ద్వారా రూ.70 లక్షలు, లోన్ల ఆదాయం రూ.2.50 కోట్లుగా పేర్కొన్నారు. గ్రాంట్స్‌, లోన్స్‌ ప్రాజెక్టు ఫండ్స్‌ ఆదాయం రూ.6,68 కోట్లుగా తెలిపారు. ఖర్చుల్లో శానిటేషన్‌ పవర్‌ చార్జీలు, వేతనాల కోసం రూ.15.78 కోట్లుగా పేర్కొన్నారు. నిర్వహణ వ్యయం రూ.4,13 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.11.06 కోట్లుగా చూపారు. డిపాజిట్‌ లోన్లు రూ.2.50 కోట్లుగా చూపించారు. తొలి బడ్జెట్‌లో పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, డ్రైనేజీ , శానిటేషన్‌, రహదారుల నిర్మాణం, నీటి సరఫరా, ప్రజాసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టిసారించామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, మున్సిపాల్‌ డీఈ హరిభువన్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement