దస్తురాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని నర్సరీలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. పీహెచ్‌సీలో సిబ్బంది హాజరు పరిశీలించారు. వర్షాలకు కూలిన ప్రహరీ, నీటి సమస్యను సిబ్బంది ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై సంబంధిత అధికారులతో రివ్యూ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వి.గోపాల్, ఎంపీడీవో బి.అరుణ, ఎంపీవో రమేశ్‌రెడ్డి, ఎంఈవో గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
‘ర్యాగింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’
నిర్మల్‌రూరల్: జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ర్యాగింగ్‌కు ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశిధర్ మాట్లాడుతూ పాఠశాలలో ఏడోతరగతి చదివే ఓ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ చేయడం అమానుషమన్నారు. దినేష్, ఆకాష్, సాయి, మున్నా, వర్మ, విగ్నేష్, రాజేశ్, సంతోష్, చందు, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.


