● ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్‌టౌన్: శ్రీరామనవమి శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. బుధవారం జిల్లా పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్‌ల అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. శ్రీరామనవమి రోజు నిర్వహించే శోభాయాత్రల బందోబస్తు ఏర్పాటుపై సమగ్రంగా చర్చించారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని, ట్రాఫిక్ నియంత్రణ కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, తదితరులు పాల్గొన్నారు.


