పెట్రోల్‌ కోసం బారులు..! | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ కోసం బారులు..!

Mar 25 2026 6:59 AM | Updated on Mar 25 2026 6:59 AM

పట్టణంలోని పలు పెట్రోల్‌ బంకుల వద్ద మంగళవారం సాయంత్రం నుంచి వాహనదారులు బారులు తీరి కనిపించారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉందన్న పుకార్లతో వాహనదారులు పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంకుల వద్ద క్యూ కట్టారు. స్థానిక గీతా పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌, డీజిల్‌ ఉన్నా.. సిబ్బంది లేరంటూ వాహనదారులకు ఇంధనం పోయకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో వాహనదారులు గంటలతరబడి క్యూలో వేచి ఉన్నారు. రిలయన్స్‌ బంకు వద్ద సైతం వాహనదారులకు పెట్రోల్‌ పోయలేదు. బాసర రోడ్డులోని ఓ బంకు వద్ద పెట్రోల్‌ కోసం వాహనదారులు భారీగా క్యూలో కనిపించారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరత విషయమై డీసీఎస్‌వో రాజేందర్‌ను ఫోన్‌లో సంప్రదించగా, కొరత లేదన్నారు. – భైంసాటౌన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement