రేపు పెన్షనర్ల నిరసన | - | Sakshi
Sakshi News home page

రేపు పెన్షనర్ల నిరసన

Mar 24 2026 6:55 AM | Updated on Mar 24 2026 6:55 AM

నిర్మల్‌ రూరల్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాలిడేషన్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా బుధవారం జిల్లా కేంద్రంలో నిరసన తెలుపనున్నట్లు పెన్షన్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు ఎంసీ.లింగన్న తెలిపారు. సంఘ భవనంలో సోమవారం మాట్లాడారు. వాలిడేషన్‌ యాక్ట్‌తో పెన్షనర్ల అస్తిత్వానికి ముప్పు కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యాక్ట్‌ను ఉపసంహరించుకోవాలని ఈనెల 25న పెన్షనర్ల భవనం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్తామన్నారు. కలెక్టర్‌ ద్వారా ప్రధానికి విజ్ఞాపనపత్రం ఇస్తామన్నారు. జిల్లాలోని పెన్షనర్లందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొజ్జ జనార్దన్‌, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎల్‌.గంగన్న, జిల్లా కార్యదర్శి మోహన్‌రెడ్డి, యూనిట్‌ బాధ్యులు రమేశ్‌, జనార్దన్‌, బాలకష్ణ, శేషాద్రి, కమలాకర్‌, జిల్లా బాధ్యులు పోశెట్టి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement