నిర్మల్‌ఖిల్లా: గోదావరి పుష్కరా లు విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపా రు. దేవాదాయ శాఖ డైరెక్టర్ హ నుమంతరావు, ప్రిన్సిపల్ సెక్రట రీ శైలజ రామయ్యర్ బాసరలో పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్ అభిలాష అభినవ్‌తో సోమవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాసరలో చేపట్టిన పనులకు సంబంధించి వివరా లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. ఇదివరకే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. బాసర జ్ఞానసరస్వతి ఆలయం, పుష్కర ఘాట్ వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. బాసర ఆలయానికి చేరుకునేలా రోడ్లను తీర్చిదిద్దుతామని అన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి..
నిర్మల్‌రూరల్: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సోమవారం సమీక్ష నిర్వహించారు. అనుమతులు లభించిన ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. చివరిదశ పనులు మిగిలి ఉన్న నిర్మాణాలు వెంటనే పూర్తి చేసి, గృహప్రవేశాలు చేపట్టాలని అన్నారు. ఇప్పటివరకు గృహ ప్రవేశాలు చేసిన ఇళ్ల వివరాలు, ఆయా దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


