పాదయాత్రగా వచ్చి సమస్యలను ఏకరువు పెట్టిన గిరిజనులపై కలెక్టర్ అభిలాషఅభినవ్ సానుకూలంగా స్పందించారు. వెంటనే పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖలతో కమిటీ వేస్తామన్నారు. మండలంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడుత రవీందర్, పూసం సచిన్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, సీపీఎం జిల్లా కార్యదర్శి గౌతమ్‌కృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు దుర్గం నూతన్‌కుమార్, బొమ్మెన సురేశ్, వసుంధర, జిల్లా కమిటీ సభ్యులు తొడసం శంభు, షశువుద్దీన్, నర్సయ్య, ముత్యం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్, పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


