రేవంతన్నా.. ఒక్కసారొచ్చిపో! | - | Sakshi
Sakshi News home page

రేవంతన్నా.. ఒక్కసారొచ్చిపో!

Mar 24 2026 6:55 AM | Updated on Mar 24 2026 6:55 AM

● ఆర్జీయూకేటీలో ఎప్పుడూ అలజడే ● అకడమిక్‌ బాగున్నా.. సౌకర్యాల్లోనే సున్నా● విద్యాప్రాంగణంలో వైద్యంపై ఆరోపణలు ● విద్యార్థుల మరణాలపైనే ఆందోళనలు ● సీఎం రావాలంటున్న ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు 9లోu మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

నిర్మల్‌
ఆటల్లో మెరికలు..!
ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు ఆటల్లో రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో తమదైన ముద్ర వేస్తున్నారు.

‘ప్రజావాణి’ అర్జీలు పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రస్థాయిలో

జిల్లా క్రీడాకారుల ప్రతిభ

నిర్మల్‌టౌన్‌: హైదరాబాద్‌లోని ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 21 నుంచి 23 తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌–17, 19 బాల బాలికల బాక్సింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ముగ్గురు బాక్సర్లు ఒక రజత, రెండు కాంస్య పతకాలు సాధించారు. 54–47 కేజీల విభాగంలో సుజల రజత పతకం, ఆర్‌.అనన్య 45–48 కేజీల విభాగంలో, దివ్య 60–63 కేజీల కాంస్య పతకాలు గెలిచారు. జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా బాక్సింగ్‌ సెక్రెటరీ, కోచ్‌ చందుల స్వామి క్రీడాకారులను అభినందించారు.

నిర్మల్‌: జ్ఞాన సరస్వతీమాత కొలువైన బాసరలో ఉన్న మరో చదువుల క్షేత్రం ఆర్జీయూకేటీ(ట్రిపుల్‌ఐటీ). గ్రామీణ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అద్భుతవరం. అలాంటి విద్యాలయంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందని అనుకుంటున్నంతలోపే ఏదో ఒక సమస్య వస్తోంది. తాజాగా తేజశ్విని అనే విద్యార్థిని మృతిచెందడంతో మరోసారి విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. దాదాపు తొమ్మిదివేల మంది విద్యార్థులు ఉండే ట్రిపుల్‌ఐటీలో పరిస్థితులు, ఏళ్లుగా వారు పడుతున్న ఇబ్బందులు, ప్రాంగణంలో పేరుకుపోయిన సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉంది. మూడేళ్లక్రితం ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులు రోజులతరబడి చేసిన ఆందోళనల నేపథ్యంలో నాడు పీసీసీ హోదాలో ఉన్న ఆయన పోలీసుల కళ్లుగప్పి, ఏకంగా గోడదూకి క్యాంపస్‌లోకి వచ్చారు. ఇక్కడి విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారి బాసరకు వచ్చిపోవాలని విద్యార్థులు కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రిగానూ ఉన్న ఆయన వస్తేనే ఆర్జీయూకేటీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భావిస్తున్నారు.

స్థాయికి తగ్గ పట్టింపేది?

‘విద్యార్థుల సమస్యలపై నిరసన చేస్తుంటే.. ఏసీ రూమ్‌ల్లో అధికారులు పడుకుంటున్నారు. విద్యార్థుల సౌకర్యాలపై పట్టించుకోవడం లేదు..’ అని అంటున్న బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఆక్రోశానికి అర్థం ఉంది. ‘మేం శాయశక్తులా కృషిచేస్తున్నాం. వర్సిటీలోనే ఉంటూ విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నాం. సమస్యల పరిష్కారానికి తమవంతు కృషిచేస్తున్నాం..’ అని అక్కడి అధికారులు చెబుతున్న మాటలు సమ్మతమే. కానీ.. ఇక్కడ బాసర ట్రిపుల్‌ఐటీ స్థాయికి తగ్గట్లుగా ప్రభుత్వాలే పట్టించుకోవడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. తొమ్మిదివేల మంది విద్యార్థులు ఉండే విద్యాప్రాంగణంలో అసౌకర్యాలపై ఏళ్లుగా అక్కడి విద్యార్థులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అరకొర నిధులను విదిలిస్తూ.. కనీసం ఏడాదిలో ఒక్కసారైనా వర్సిటీలోకి అడుగుపెట్టకుండా పాలకులు కా లం గడిపేస్తున్నారు. ఎండ, వాన లెక్కచేయకుండా 2022లో పెద్దఎత్తున విద్యార్థులు చేసిన ఆందోళనలతో అప్పటి విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సిటీకి తరలివచ్చారు. ఆ తర్వాత ఏదో చేసినట్లు మమ అనిపించారు. ఆ తర్వాత మళ్లీ పాతకథనే పునరావృతం కావడంతో ప్రస్తుత ప్రభుత్వం ఇన్‌చార్జి వీసీగా ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ను నియమించింది.

అకడమిక్‌ బాగున్నా..

విద్యాపరంగా దేశంలోనే చాలా వర్సిటీలతో బాసర ట్రిపుల్‌ఐటీ పోటీపడుతోంది. ఇక్కడి విద్యార్థులు తమ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. మంచి కంపెనీల్లో రూ.లక్షల్లో వేతనాలూ అందుకుంటున్నారు. కొత్త ఇన్‌చార్జి వీసీగా ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ నియమితులైన తర్వాత అకడమిక్‌ పరంగా చాలావరకు మార్పులు వచ్చినట్లు విద్యార్థులూ ఒప్పుకుంటున్నారు. కానీ.. అరకొర వసతులు, అసౌకర్యాల విషయంలోనే ఎలాంటి మార్పు లేదని, సరైన వైద్యం వంటివి లేక విద్యార్థుల ప్రాణాలు పోతున్నా.. పట్టింపు లేదన్న వాదనను ఆ విద్యార్థులే బలంగా వినిపిస్తున్నారు. ఇక్కడి వైద్యసేవలపైన ముందునుంచీ ఆరోపణలు ఉన్నాయి. తాజాగా తేజశ్విని మరణానికీ సకాలంలో సరైన వైద్యం, సలహాలు అందించలేదనేది విద్యార్థులు పేర్కొంటున్నారు. వేలమంది ఉండే చోట పూర్తిస్థాయిలో మల్టీస్పెషాలిటీ సౌకర్యాలను ఎందుకు అందించరూ.. అన్న ప్రశ్న బలంగా వస్తోంది.

బాసర ట్రిపుల్‌ఐటీ

ఆందోళన చేసేదాకా ఎందుకు..

రాష్ట్రంలో ఉన్న ఏకై క ట్రిపుల్‌ఐటీ మెయిన్‌క్యాంపస్‌లో ఏం జరుగుతోందన్న విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియదా..!? క్యాంపస్‌లో ఎవరేం చేస్తున్నారు, విద్యార్థులు ఎటువైపు వెళ్తున్నారు.. అనే విషయాలు పైస్థాయి దాకా వెళ్లకుండా ఉంటాయా..!? వర్సిటీలో ఏం జరుగుతుందో తెలిసినా ప్రభుత్వం సైలెంట్‌గా ఉంటోందా..!? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో ఉన్న వర్సిటీపై స్థానిక ముధోల్‌ ఎమ్మెల్యే రామారావుపటేల్‌ మినహా ఎవరూ స్పందించడం లేదు. ఇది కూడా ప్రభుత్వం సీరియస్‌గా స్పందించకపోవడానికి కారణమా..!? అన్న సందేహాలు ఉన్నాయి. మరోవైపు కొంతమంది విద్యార్థులే మిగితావారిని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఏది ఏమైనా.. ఇక్కడ ఆర్జీయూకేటీలో సమస్యలు ఉన్నవి వాస్తవం. ఏ ప్రభుత్వం వాటిపై సీరియస్‌గా దృష్టిపెట్టి పరిష్కరించడం లేదు.

సీఎం సార్‌ వస్తేనే..

ఓవైపు ప్రపంచంతో పోటీపడే స్థాయిగల విద్యార్థులు ఉన్నా.. వారికి కనీసం సౌకర్యాలు కల్పించే స్థాయిలో నిధులు ఇవ్వడం లేదు. బాసర ట్రిపుల్‌ఐటీ సమస్యలపై పూర్తి అవగాహన ఉండటంతోపాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగానూ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా వస్తేనే ఆర్జీయూకేటీలో అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. లేనిపక్షంలో జిల్లాలో ఉన్న ఒక్క విద్యాక్షేత్రం ఎప్పటికీ ఇలా ఏదోఒక సమస్యతో సతమతమవుతూనే ఉంటుంది.

ఈ ఫొటో 2022, జూన్‌ 17నాటిది. ఇందులో మాస్క్‌ పెట్టుకుని ఉన్నది అప్పటి టీపీసీసీ చీఫ్‌, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఆరోజు బాసర ట్రిపుల్‌ఐటీ అగ్ని గుండంలా మండుతోంది. తమ సమస్యలపై ఇక్కడి విద్యార్థిలోకం భగ్గుమంది. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాసరవైపు ఎవరినీ వెళ్లకుండా అడుగడుగునా పోలీసు బందోబస్తు పెట్టింది. అలాంటి నిర్బంధంలో.. వాహనాలు, డ్రెస్సులు మారుస్తూ, మాస్కులు పెట్టుకుంటూ హైదరాబాద్‌ నుంచి రేవంత్‌రెడ్డి బాసర మండలానికి చేరుకున్నారు. ఆర్జీయూకేటీ వెనుకవైపు నుంచి ట్రాక్టర్‌ ఎక్కి, పంటచేల మీదుగా ప్రాంగణానికి చేరుకున్నారు. గోడదూకి, ముళ్లకంపల మధ్యలో నుంచి విద్యార్థుల వద్దకు వెళ్లారు. వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తుండగా పోలీసులు అరెస్టుచేసి లోకేశ్వరం పోలీసుస్టేషన్‌ తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement