వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం పూర్తిగా తగ్గుతుంది.
చర్చల ద్వారా
సమస్యల పరిష్కారం
నిర్మల్: ఏ సమస్య ఉన్నా చర్చల ద్వారా పరిష్కారమవుతుందని, అనవసర ఆవేశాలతో విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాసర ట్రిపుల్‌ఐటీ(ఆర్జీ యూకేటీ)లో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థుల నిరసనలు, సెలవులు ప్రకటించడం, తది తర అంశాలపై సోమవారం హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. క్యాంపస్‌లో ప్రస్తుత స్థితిగతులను, విద్యార్థుల ఆందోళనల వెనుక ఉన్న కారణాలను ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ మురళీదర్శన్ మంత్రికి వివరించారు. క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో సెలవులు ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు. విద్యార్థుల ప్రధాన డిమాండ్లను తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని, కేవలం ఆవేశంతో ఆందోళనలు చేసి, భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని హితవు పలికారు. సమస్యలు ఏవైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థుల ప్రయోజనాలను కా పాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్ప ష్టం చేశారు. క్యాంపస్‌లో మౌలిక వసతులు, విద్యాప్రమాణాల మెరుగుదల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. త్వరలోనే క్యాంపస్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ట్రిపుల్‌ఐటీని సందర్శించి, విద్యార్థులతో చర్చిస్తామన్నారు.


