మసిపూసి.. ఏమార్చి..! | - | Sakshi
Sakshi News home page

మసిపూసి.. ఏమార్చి..!

Mar 23 2026 9:08 AM | Updated on Mar 23 2026 9:08 AM

8లోu సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

నల్లబంగారం దందాలో అక్రమాల బాగోతం అక్రమ ఈ–వేబిల్లులతో తప్పుదోవ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పట్టని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు

వేసవి నేపథ్యంలో తాగునీటిపై అప్రమత్తం రంగుమారుతున్న మిషన్‌ భగీరథ నీరు లీకేజీలు అరికట్టాలంటున్న ప్రజలు

నిర్మల్‌

గోదావరికి ‘పుష్కర సిరి’

గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. 2027, జూన్‌ 26 నుంచి జులై 7వరకు జరగనున్నాయి. ఈసారి ‘కుంభమేళా’ తరహాలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

భైంసాటౌన్‌: నల్లబంగారం(నేలబొగ్గు) దందా అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. నకిలీ, తప్పుడు వేబిల్లులతో ప్ర భుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని వని, చంద్రాపూర్‌, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోని ఇటుకబట్టీలకు బొగ్గు అక్రమంగా రవాణా జరుగుతోంది. కొన్నిసార్లు జీరోలో తరలిస్తుండగా, మరికొన్నిసార్లు తప్పుడు వేబిల్లులతో బురిడీ కొట్టిస్తున్నారు. ఆదివారం సైతం ఓ లారీ భైంసా మండలంలోని ఓ ఇటుక బట్టీకి బొగ్గు తీసుకొచ్చింది. దాని వే బిల్లులో సరుకు విలువ తక్కువగా చూపారు. దీంతోపాటు జీఎస్టీ సైతం తక్కువగా రావడంతో వాణిజ్య పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

జిల్లాలో దాదాపు వంద వరకు ఇటుక బట్టీలు ఉంటాయి. ముఖ్యంగా భైంసా డివిజన్‌లోని ముధోల్‌, తరోడ, పిప్రి, సరస్వతినగర్‌, వానల్‌పాడ్‌, నిర్మల్‌ డివిజన్‌లోని బీరెల్లి, సిద్దులకుంట, తదితర ప్రాంతాల్లో ఇటుకబట్టీలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కోబట్టీకి నెలకు 10 నుంచి 20 టన్నుల నేలబొగ్గు అవసరం ఉంటుంది. సింగరేణి బొగ్గు ధర ఎక్కువగా ఉందన్న కారణంతో జిల్లాలోని ఇటుకబట్టీల నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా బొగ్గు తెప్పించుకుంటున్నారు. లారీలో 35.52 టన్నులకు వాస్తవ ధరతో పోలిస్తే జీఎస్టీ రూ.34,525 చెల్లించాలి. కానీ, సరుకు విలువ తక్కువగా చూపడంతో దాదాపు రూ.20 వేల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఇలా ఒక్కలారీకే ఇంతమొత్తంలో గండిపడితే, నిత్యం జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖకు ఎంతమేర గండిపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం అక్రమంగా నేలబొగ్గు రవాణాపై వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఈశ్వర్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement