శనగ కొనుగోళ్లు షురూ.. | - | Sakshi
Sakshi News home page

శనగ కొనుగోళ్లు షురూ..

Mar 23 2026 9:08 AM | Updated on Mar 23 2026 9:08 AM

భైంసాటౌన్‌/తానూరు/ముధోల్‌: రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవా లని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ అన్నారు. భైంసా పట్టణంలోని ఏఎంసీ మార్కెట్‌ యార్డు ఆవరణ లో, తానూరు మండల కేంద్రంలోని డాంగపల్లి వ్యవసాయ మార్కెట్‌ గోదాంలో, ముధోల్‌ మండలం విఠోలి గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రాల ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎకరాకు 7 క్వింటాళ్లు కొనుగో లు చేస్తారని తెలిపారు. రైతులు దళారులకు విక్రయించకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి క్వింటాల్‌కు రూ.5,875 మద్దతు ధర పొందాలని తెలిపారు. త్వరలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. తానూరులో రైతును సన్మానించారు. కార్యక్రమాల్లో భైంసా మున్సిపల్‌ చైర్మన్‌ తూమోల్ల దత్తాత్రి, ఏఎంసీ చైర్మన్‌ ఆనంద్‌రా వు పటేల్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం శ్రీనివాస్‌, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ మహేశ్‌, పీఏసీఎస్‌ ప్రత్యేకాధి కారి రాజమౌళి, పీఎసీఎస్‌ మాజీ చైర్మన్‌ నారాయణ్‌రావ్‌ పటేల్‌, బీజేపీ తానూరు మండల అధ్యక్షుడు లక్ష్మ ణ్‌రెడ్డి, ముధోల్‌ మండల అధ్యక్షుడు కోరి పోత న్న, బోరిగాం సర్పంచ్‌ కల్లెడ కిష్టయ్య, ఏవో మని ష, పీఎసీఎస్‌ సీఈవో సాయిరెడ్డి, నాయకులు చిన్నారెడ్డి, గోవింద్‌రావ్‌పటేల్‌, శివాజీ పటేల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement