వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Mar 23 2026 9:08 AM | Updated on Mar 23 2026 9:08 AM

వాతావరణం 9లోu

వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది.

ఖానాపూర్‌కు చేరుకున్న పాదయాత్ర

ఖానాపూర్‌: పెంబి మండలం యాపలగూడెం గ్రామం గిరిజ నులు నిర్మల్‌ వరకు సుమారు 75 కిలోమీటర్లు శనివారం ప్రారంభించిన పాదయాత్ర ఆదివారం ఖానాపూర్‌ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉడత రావేందర్‌ మాట్లాడుతూ, పెంబి మండల ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దోత్తి, కడెం వాగులపై వంతెనల నిర్మాణం చేపట్టాలని అన్నారు. పీహెచ్‌సీలో వైద్యుడిని నియమించాలని, ఆదివాసి గ్రామాలకు శుద్ధమైన తాగునీటి కోసం బోర్లు వేయాలని కోరారు. పస్పుల వాగుపై బ్రిడ్జి పునర్నిర్మాణం, పెంబి నుంచి సిరిచెల్మ వరకు రహదా రి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఖానాపూర్‌ నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఖానాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని, ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఖానాపూర్‌లోనే ప్రారంభించాలని కోరారు. పట్టణంలో రోడ్ల విస్తరణ, పోడు భూములకు పట్టాలు, చి రు వ్యాపారులకు సమీకృత మార్కెట్‌ నిర్మాణం చేపట్టాలని కోరారు. కడెం మండలం అల్లంపెల్లి–గంగాపూర్‌ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణంతోపాటు రహదారి సౌకర్యం కల్పించాలని అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గౌతమ్‌ కృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్‌ కుమార్‌, నాగేలి నరస య్య, డాకూర్‌ తిరుపతి, ఫసియుద్దీన్‌, నిర్మల, ధర్మరాజు, విజయ్‌, దిగంబర్‌, పానగంటి నరేశ్‌, తొడసం శంభు, చుంచుల నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement