గజ్జలమ్మకు పూజలు | - | Sakshi
Sakshi News home page

గజ్జలమ్మకు పూజలు

Mar 23 2026 9:08 AM | Updated on Mar 23 2026 9:08 AM

కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తులు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీకాంత్‌ రామానుజదాస్‌, నగేశ్‌ ఆధ్వర్యంలో గజ్జలమ్మ దేవికి అభిషేకం,అ లంకరణ అర్చన, హారతి, పల్లకిసేవ తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

కరాటే బెల్ట్‌ గ్రేడింగ్‌ పరీక్షలు

భైంసాటౌన్‌: జిల్లా కరాటే అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం జేకేఏఐ షోటోకాన్‌ కరాటే బెల్ట్‌ గ్రేడింగ్‌ పరీక్షలు నిర్వహించా రు. తెలంగాణ ఉపాధ్యక్షుడు, చీఫ్‌ ఎగ్జామినర్‌ తేజందర్‌సింగ్‌ భాటియా, జిల్లా అధ్యక్షుడు కొండాజీ శ్రీకాంత్‌ పోటీలు ప్రారంభించారు. ఈ పరీక్షల్లో జూనియర్‌ విభాగంలో రెడ్‌–106, యెల్లో–35, ఆరెంజ్‌–9, గ్రీన్‌–1, బ్రౌన్‌–2, బ్లాక్‌–2 బెల్ట్స్‌ సాధించినట్లు మాస్టర్‌ సాయికృష్ణ వివరించారు. కార్యక్రమంలో సీనియర్‌ ఇన్‌స్ట్రక్టర్లు శ్రీకాంత్‌, జ్ఞానతేజ, నితిన్‌గౌడ్‌, శివరాజ్‌గౌడ్‌, రిషికేష్‌, అక్షర్‌తేజ్‌, గజేందర్‌, అన న్య, నాగేష్‌, లింగం, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement