న్యూస్‌రీల్
నిర్మల్
● బాసర అభివృద్ధిపై రాని స్పష్టత ● రాష్ట్ర బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు
హామీలు అమలు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి నెరవేర్చని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాంనాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలను వంచించిందని ఆరో పించారు. రైతు భరోసా సమయానికి అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతోందని తెలిపారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. భూభారతి రెవె న్యూ సదస్సుల్లో ప్రజలు దరఖాస్తులు అందించినా సమస్యలు పరిష్కారం కావడంలేదని పే ర్కొన్నారు. గ్రామాల్లో సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ కారణంగా అర్హులు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు కరిపే విలాస్, యాతలం చిన్నారెడ్డి, నల్ల రవీందర్‌రెడ్డి, నాయకులు మెడిసమ్మె రాజు, ఆకుల కార్తిక్, సుంకరి సాయి, గిల్లి విజయ్, సోప్పరి గంగాధర్, సర్పంచ్ రాచకొండ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్: ‘కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకెత్తయితే, వాళ్లు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరో ఎత్తు. ఒక్క ఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, ఆ అభద్రతాభావం ఉండకూడదన్నదే మా ప్రభు త్వ సంకల్పం. రాష్ట్రంలోని కోటి 15లక్షల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున జీవితబీమా అందించేలా జూన్ 2నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నూతనంగా ప్రవేశపెడ్తున్నాం’ అంటూ ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. జిల్లాలో తెల్లరేషన్‌కార్డున్న లబ్ధిదారులందరికీ ఈ కొత్త పథకం ఊరట కల్పించనుంది. అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ప్రజా కర్షకంగా ఉంది. కొత్త పింఛ న్లు, ఎంప్లాయీస్ హెల్త్‌స్కీమ్, ఇంటర్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ వంటివి సానుకూలంగా ఉండటంతో ఆయా వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. మరోవైపు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి నిర్మల్‌కు వచ్చి ప్రకటించినా బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవు. బాసర ఆలయ అభివృద్ధికీ ఎలాంటి నిధులు ఇవ్వలేదు. ఇది ‘పరిషత్’ ఎన్నికల ఆకర్షణ బడ్జెట్‌గా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
విద్యార్థులందరికీ బ్రేక్‌ఫాస్ట్
2026–27 విద్యాసంవత్సరం నుంచి ప్రీ–ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 66వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందనుంది. ప్రతీ విద్యార్థికి వారానికి మూడ్రోజులు పాలు, మిగతా మూడ్రోజులు రాగిజావ అందిస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు.
హెల్త్ ప్రొఫైల్.. డిజిటల్ హెల్త్‌కార్డులు
దేశంలో ఎక్కడాలేనట్లు ప్రజల హెల్త్ ప్రొఫైల్ తేనున్నట్లు బ డ్జెట్‌లో ప్రకటించారు. ప్రజారో గ్యంలో భాగంగా ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని, వీటి నిర్వహణలో గోప్యత పాటిస్తామని ప్రకటించారు. జిల్లాలో దాదాపు 10లక్షల మందికి కార్డులు అందనున్నాయి.
గోదావరి పుష్కరాలకు రూ.500కోట్లు
2027 జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు అ త్యంత పవిత్రంగా భావించే గోదావరి పు ష్కరాలను ‘కుంభమేళా’ తరహాలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పుష్కరాల నిర్వహణకు ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లు ప్రతి పాదించారు. జిల్లాలోని బాసర నుంచి దస్తురాబా ద్ వరకు గోదావరి పొడవునా భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశాలున్నాయి.
‘ఇంటర్’కు మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇకపై మధ్యాహ్న భోజనం అందనుంది. ఇంటర్ విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేయనున్నట్లు భట్టి ప్రకటించారు. జిల్లాలో మొత్తం 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా, ఇందులో చదువుతున్న దాదాపు 4–5వేల మంది విద్యార్థులకు నూతన విద్యాసంవత్సరం నుంచి బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందనున్నాయి.


