‘నవోదయ’ ప్రవేశాల్లో వెనుకబాటు | - | Sakshi
Sakshi News home page

‘నవోదయ’ ప్రవేశాల్లో వెనుకబాటు

Mar 20 2026 8:13 AM | Updated on Mar 20 2026 8:13 AM

నిర్మల్‌ జిల్లా నుంచి 37 మంది.. కుమురంభీం జిల్లాలో ఏడుగురికి సీట్లు అవగాహన లేక రాణించలేకపోతున్న గ్రామీణ విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని నిపుణుల సూచన

వారు

కాగజ్‌నగర్‌టౌన్‌: జవహర్‌ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్లే. ఆరో తరగతిలో ప్రవేశం పొందితే 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఉచితంగా విద్య అందిస్తారు. అయితే చాలా మంది విద్యార్థులు పరీక్ష తీరుపై అవగాహన లేకపోవడంతో పోటీలో వెనుకబడుతున్నా రు. ఈ ఏడాది ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ఫలితాల్లో నిర్మల్‌ జిల్లా నుంచి 37 మంది సీట్లు దక్కించుకుంటే కుమురంభీం జిల్లా నుంచి కేవలం ఏడుగురే సీట్లు సాధించారు.

80 సీట్లకు ప్రవేశపరీక్ష

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాగజ్‌నగర్‌ పట్టణంలో జవహర్‌ నవోదయ విద్యాల యం ఉంది. మెరుగైన విద్యాబోధనతోపా టు వసతి సౌకర్యం, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం ఉచితంగా కల్పిస్తారు. విద్యార్థులకు వేర్వేరుగా వసతి, భోజన సౌకర్యం ఉంటుంది. బాలికలకు 33 శాతం రిజర్వేషన్‌ సైతం అమలు చేస్తారు. గ్రామీణ విద్యార్థులకు నిబంధనలకు అనుగుణంగా సీట్లు కేటాయిస్తారు. 2026– 27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో 80 సీట్లకు మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు 6,196 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా 4,478 మంది పరీక్షకు హాజరయ్యారు.

అవగాహన కరువు

ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో నవోదయ ప్రవేశ పరీక్షకు సక్రమంగా సన్నద్ధం కావడం లేదు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం సిలబస్‌ గురించి అవగాహన కల్పించడం లేదు. దీంతో కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి ఎక్కువ మంది సీటు సాధించలేకపోతున్నారు. నాలుగేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఏటా ఐదు వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నా అందులో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు తక్కువ మంది ఎంపికవుతున్నారు.

ముందస్తు ప్రణాళిక అవసరం

నవోదయ విద్యాలయంలో సీటు సాధించాలంటే ముందస్తు ప్రణాళిక అవసరం. నాలుగో తరగతి నుంచే విద్యార్థులు ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తే.. ఇందులో మెంటల్‌ ఎబిలిటీ, గణితం, పేరాగ్రాఫ్‌ విభాగాల్లో 80 ప్రశ్నలు ఉంటాయి. మెంటల్‌ ఎబిలిటీకి సంబంధించి 50 మార్కులకు పది భాగాల్లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో భాగంలో నాలుగు ప్రశ్నలు ఉంటాయి. గణితానికి సంబంధించి 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి. పేరాగ్రాఫ్‌కు 20 ప్రశ్నలకు 25 మార్కులు కేటాయిస్తారు.

నవోదయ ఫలితాల వివరాలు

జిల్లా దరఖాస్తులు రాసిన ఎంపికై ంది

ఆదిలాబాద్‌ 1,290 942 17

నిర్మల్‌ 1,552 1278 37

మంచిర్యాల 1,722 1267 19

ఆసిఫాబాద్‌ 1,632 991 7

అవగాహన అవసరం

నవోదయ విద్యాలయంలో సీటు సాధించాలంటే ముందుగా తల్లిదండ్రులకు అవగాహన అవసరం. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి పోటీ ఎక్కువ ఉన్నా తక్కువ మంది ఎంపికవుతున్నారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. ఆయా పాఠశాలల్లోని ఐదో తరగతి విద్యార్థులకు ఏడాది ముందు నుంచే పరీక్ష విధానం, సిలబస్‌ గురించి వివరిస్తూ సన్నద్ధం చేయాలి. – రేపాల కృష్ణ, నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్‌, కాగజ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement