కడెం: కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విత్తనచట్టం, విద్యుత్‌చట్టం, జీరామ్‌జీని రద్దు చేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం మాట్లాడారు. కేంద్రం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతోందని ఆరోపించారు. వ్యవసాయరంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందని విమర్శించారు. ఇందులో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాజు, ఉపాధ్యక్షుడు కేశవ్, జిల్లా కమిటీ సభ్యులు ఉపాలి, ప్రసాద్, స్వామి, దీనాజి, గంగాధర్, శ్రీనివాస్, రాజేశ్వర్ పాల్గొన్నారు.


