భైంసా: భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ బాసర ట్రిపుల్‌ఐటీని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పీయూసీ–1, పీయూసీ–2 విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై చర్చించారు. ప్రస్తుత వార్షిక పరీక్షలు, ఎంసెట్, ఇతర పోటీ పరీక్షల సిద్ధతపై విద్యార్థులను అడిగి తెలుసుకుని, క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. క్యాంపస్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం క్యాంపస్‌లోని మెస్‌లు, వంట గదులను పరిశీలించి నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


