సారంగపూర్:కొత్తగుడిలో కొలువుదీరిన అడెల్లి మహాపోచమ్మకు మరింత కొత్తశోభ వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన విక్ష కన్‌స్ట్రక్షన్స్ పేరిట ఇళ్లు నిర్మిస్తున్న మండలకేంద్రానికి చెందిన పదిరె వేణుచందర్‌రెడ్డి, కవిత దంపతులు తమ ఇలవేల్పు పో చమ్మకు గురువారం వెండి మకరతోరణం అందించారు. ఏడు కిలోల వెండితో(రూ.20.94 లక్షల విలువైన) దీనిని చేయించారు. తరాలుగా తమ ఇంటి నుంచే గంగపోచమ్మ నగలు వెళ్తుండటం, ఇలవేల్పుగా కొలుస్తుండటంతో తమవంతుగా అమ్మవా రికి వెండి మకరతోరణం చేయించినట్లు కవిత, వేణుచందర్‌రెడ్డి దంపతులు తెలిపారు. దంపతులను మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలయ చైర్మన్ భోజాగౌడ్, ఈవో భూమయ్య తదితరులు సన్మానించారు. ఇందులో అడెల్లి సర్పంచ్ దండు సాయన్న, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సుచరిత రాజేశ్వర్‌రావు, మాజీ చైర్మన్ మాధవరావు పాల్గొన్నారు.


