అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి

Mar 17 2026 7:29 AM | Updated on Mar 17 2026 7:29 AM

● ఎస్పీ డాక్టర్‌ జానకీషర్మిల

నిర్మల్‌ టౌన్‌: అర్జీదారుల సమస్యలను పోలీస్‌ అధి కారులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్‌ జానకీషర్మిల సూ చించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ వారి సమస్యలు తెలుసుకొని సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం తెలియజేయాలని సూచించారు.

అర్జీదారుల సమస్య తెలుసుంటున్న ఎస్పీ జానకీషర్మిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement