రైతుకు భరోసా ఎప్పుడో..!
న్యూస్‌రీల్
యాసంగి మొదలై మూడు నెలలు.. ఎదురుచూపుల్లోనే కర్షకులు జిల్లాలో 1.88 లక్షల మంది అర్హులు శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు భూముల గుర్తింపు
నిర్మల్
ఆర్జీయూకేటీలో ’టీమ్ గరుడ’
ఆర్జీయూకేటీలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఎస్‌ఏఈ ఇండియా ఆర్జీయూకేటీ బి కొలీజియట్ క్లబ్ ఆధ్వర్యంలో ‘టీమ్ గరుడ’ వాహనాలు ఆవిష్కరించారు.
మాజీ సీఎంను కలిసిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు
ఖానాపూర్: ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ భుక్యా జాన్సన్‌నాయక్ ఆధ్వర్యంలో కలిసిన కౌన్సిలర్‌లను కేసీఆర్ అభినందించారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో రాజగంగన్న, సోయబ్, పోసమ్మ, ఇందిర, ఉన్నారు
నిర్మల్‌చైన్‌గేట్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే అన్నదాతల ఖాతాల్లో యాసంగి ’రైతు భరోసా’ పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని ప్రభుత్వం గతంలో వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా పుర ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో నగదు ఎప్పుడు జమ అవుతుందా? అని జిల్లా కర్షకులు ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో 1.88 లక్షల మంది..
జిల్లాలో పెట్టుబడి సాయానికి అర్హులైన రైతులు యాసంగి ’భరోసా’ కోసం నిరీక్షిస్తున్నారు. రబీ సీజన్ ప్రారంభమై మూడు నెలలైంది. వరినాట్లు, పంటలు సాగుచేసి రెండు నెలలు దాటింది. అత్యధిక విస్తీర్ణంలో సాగైన వరిపైరు పొట్టదశకు రాగా.. మందులు, ఎరువుల కోసం రైతులు వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి ఎకరాకు మొత్తం రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం గతేడాది పేర్కొంది. ఈ ప్రకారమే వానాకాలం సాయం మంజూరు చేసింది. ఖరీఫ్–2025లో జిల్లాలోని 1,88,597 మంది ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద రూ.268.85 కోట్లు జమయ్యాయి. రబీ సీజన్ ముగుస్తున్నా రైతు భరోసా పెట్టుబడిసాయం ఎప్పుడు వస్తుందని రైతులు అధికారులను అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా గురించి ఏమీ ప్రస్తావించకపోవడంతో అధికారులు కూడా ఏ విషయం చెప్పలేకపోతున్నారు. దీంతో ఈసారి రైతుభరోసా అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రూ.7,500 సాయం ఎప్పుడో..
రైతులకు పెట్టబడిలో సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధుకు శ్రీకారం చుట్టింది. ఎకరాకు రూ.6 వేలు పెట్టుబడి సహాయం అందిస్తూ వచ్చారు. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పేరు రైతు భరోసాగా మార్పు చేసి ఎకరాకు రూ.6 వేల చొప్పున ఆందిస్తుంది. పెరిగిన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడితో రూ.6 వేలు ఎటూ సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వానాకాలం మండలాల వారీగా
అందిన భరోసా వివరాలు
మండలం రైతుల పొందిన సొమ్ము
సంఖ్య (రూ.లలో)
భైంసా 15,721 26,52,87,944
కుభీర్ 18,306 30,52,16,087
కుంటాల 8,186 13,18,81,741
దస్తూరాబాద్ 5,385 5,79,71,675
కడెం 11,750 14,24,94,612
ఖానాపూర్ 9,721 10,04,45,998
పెంబి 6,032 9,47,66,837
బాసర 6,793 11,35,78,013
లోకేశ్వరం 12,772 17,11,59,230
ముధోల్ 12,499 207079416
తానూర్ 15,588 26,40,92,246
దిలావర్‌పూర్ 6,962 9,28,60,943
నర్సాపూర్(జి) 7,487 10,23,01,284 సోన్ 7,577 8,55,12,709
లక్ష్మణచాంద 9,066 9,95,38,344
మామడ 10,947 14,80,91,078
నిర్మల్ రూరల్ 9,119 9,85,59,549
నిర్మల్ అర్బన్ 561 42,57,472
త్వరగా అందించాలి
రబీసీజన్ ప్రారంభమైనందున వెంటనే పెట్టుబడిసాయం అందజేయాలి. ఖరీఫ్ పంటలు దెబ్బతిని రైతులందరూ రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ స్పందించి త్వరగా నిధులు విడుదల చేయాలి.
– సాయన్న రైతు
ఈ సారి.. మరింత ఆలస్యం..
రబీ సీజన్‌కు ముందు, అంటే నవంబర్‌లో రైతు భరోసా నిధులు జమ చేస్తే విత్తన, కూలీ ఖర్చులకు వెసులుబాటు కలిగేది. కానీ, మంజూరు మరింత ఆలస్యమైంది. ఇదే సమయంలో ప్రభుత్వం కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. శాటిలైట్ సర్వే ఆధారంగా కేవలం సాగుచేసిన భూములకే సాయం అందజేస్తామని వెల్లడించింది. ఆ ప్రక్రియతో నిధుల మంజూరు మరికొంత ఆలస్యమైంది. అంతలోనే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికలూ ముగిసినందున, ఇప్పటికై నా పంట సాయం అందజేస్తే సాగు ఖర్చులకు వెచ్చించుకుంటామని అన్నదాతలు అంటున్నారు.
రైతుకు భరోసా ఎప్పుడో..!


