ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ని కలిసిన బోరిగాం బాధితులు
లక్ష్మణచాంద: తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను డీడీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో బోరిగాం బాధితులు హైదరాబాద్‌లో బుధవారం కలిశారు. అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మా ట్లాడుతూ నిర్మల్ జి ల్లా లక్ష్మణచాంద మండలం బోరిగాం గ్రామానికి చెందిన పోతరాజు చిన్నమ్మ అని ఎస్టీ(నాయక్‌పోడు) చెందిన మహిళపై అదే గ్రామ సర్పంచ్ మల్లికార్జున్‌రెడ్డి దాడి చేసి రెండు నెలలు గడుస్తున్నా అరెస్టు చేయడం లేదని తెలి పారు. నిర్మల్ పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు. తప్పు చేసిన వ్యక్తులు బయట తిరుగుతున్నారని తెలిపారు. ఇప్పటికై నా పోలీస్ యంత్రాంగం స్పందించి వెంటనే బాధిత మహిళకు న్యాయం చేసి సర్పంచ్ పైన చట్టరీత్యా చర్య తీసుకోవా లని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు తెలిపారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి వినతిపత్రం అందించారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని కోరారు. వినతి స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మంత్రి శ్రీహరి ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేలాగా అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు అర్జున్ లింగన్న, నాయక్‌పోడ్, సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భీమన్న, మండల అధ్యక్షుడు మల్లేశ్, భూమవ్వ తదితరులు ఉన్నారు.


