మాది ఫ్రెండీ ్ల పాలకవర్గం
పాలనా అలాగే ఉంటుంది.. శాంతియుత, అవినీతి రహిత పాలనే ధ్యేయం.. మౌలిక సదుపాయాలకు ప్రథమ ప్రాధాన్యత భైంసా మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి
భైంసాటౌన్: ‘భైంసా మున్సిపల్ చరిత్రను తిరగ రాసేలా పట్టణ ప్రజలు మార్పును కోరుకున్నా రు. అరాచక, అవినీతి, నియంతత్వ సర్కారును దించి సోదర భావం ప్రతిభింభించే జనతా సర్కారుకు అధికారం కట్టబెట్టారు. వారి అంచనాలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తాం’ అని మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి అన్నారు. బుధవారం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు.
చైర్మన్‌గా తొలి ప్రాధాన్యత..
నేను ఇక్కడే పుట్టి పెరిగాను. పట్టణంపై, ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. గతంలో లేనివిధంగా ఈసారి హిందూ, ముస్లిం సోదర భావం ప్రతిబింబించే పాలకవర్గం కొలువుదీరింది. ప్రజల ఆశలు, అంచనాలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తాం. అందరి సూచనలు, సలహాలతో ముందుకెళ్తాం.
అనేక సమస్యలు..
భైంసా పట్టణంలో చాలావరకు కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవు. అందుకే తొలి ప్రాధాన్యంగా ఇంటింటికి తాగు నీరు, కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వీధి దీపాల ఏర్పాటు, పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం. శివారు కాలనీల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
తొలి అడుగే చైర్మన్‌గా..
భైంసా మున్సిపల్‌లో కొన్నేళ్లుగా ఏకస్వామ్య, నియంతృత్వ పాలన సాగింది. ప్రజలు కూడా మార్పును కోరుకున్నారు. అందుకే ఈసారి బీజేపీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేయాలని అనుకున్నా.. కానీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా 23వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించాను. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది.
ప్రత్యేకంగా నిలుస్తారా..
భైంసా పట్టణానికి రాష్ట్రంలోనే సున్నిత ప్రాంతంగా అప్రతిష్ట ఉంది. ఆ మచ్చను తొలగించేలా సోదరభావం చాటుతాం. ఎమ్మెల్యే రామారావు పటేల్, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పట్టణాభివృద్ధి, అమృత్ స్కీమ్ కింద పట్టణ అభివృద్ధికి కృషి చేస్తాం. ఇళ్ల నిర్మాణ అనుమతుల విషయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరళమైన విధానాలు అమలు చేస్తాం.
బయోడేటా...
పేరు : దత్తాత్రి
పుట్టిన తేదీ : 14–02–1981
తల్లిదండ్రులు : కళావతి, ముత్తన్న
విద్యాభ్యాసం : డిగ్రీ
భార్య : శ్వేత
పిల్లలు : వింధ్యశ్రీ, భువనచంద్ర
మాది ఫ్రెండీ ్ల పాలకవర్గం


