భైంసా మున్సిపల్‌ చైర్మన్‌కు మాజీ ఎమ్మెల్యే సన్మానం | - | Sakshi
Sakshi News home page

భైంసా మున్సిపల్‌ చైర్మన్‌కు మాజీ ఎమ్మెల్యే సన్మానం

Feb 19 2026 10:15 AM | Updated on Feb 19 2026 10:15 AM

భైంసా మున్సిపల్‌ చైర్మన్‌కు మాజీ ఎమ్మెల్యే సన్మానం

భైంసా మున్సిపల్‌ చైర్మన్‌కు మాజీ ఎమ్మెల్యే సన్మానం

భైంసారూరల్‌: భైంసా మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికై న తూమోల్ల దత్తాత్రిని మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి బుధవారం సన్మానించారు. మండలంలోని దేగాం గ్రామంలో తన నివాసంలో భైంసా మున్సిపల్‌ చైర్మన్‌ దత్తాత్రికి పూలమాలలు, శాలువాలతో అభినందనలు తెలిపి మిఠాయిని తినిపించారు. ప్రజలు విశ్వాసంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పట్టణాభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చైర్మన్‌ దత్తాత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజల సహకారంతో భైంసా మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement