నిర్మల్‌ అభివృద్ధిపై విజన్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ అభివృద్ధిపై విజన్‌

Feb 16 2026 7:20 AM | Updated on Feb 16 2026 7:20 AM

నిర్మ

నిర్మల్‌ అభివృద్ధిపై విజన్‌

● సమస్యల్లేని పట్టణమే ప్రథమ లక్ష్యం ● అన్నివర్గాలతో కలిసి పనిచేస్తాం ● ‘సాక్షి’తో నిర్మల్‌ మున్సిపాలిటీ కాబోయే చైర్‌పర్సన్‌ అప్పాల కావ్య

నిర్మల్‌: ‘ వందల ఏళ్ల క్రితమే నాటి పాలకులు నిర్మల్‌ పట్టణాన్ని ఓ ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. అలాంటి విజన్‌, ముందుచూపుతోనే మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పనిచేయాలని అనుకుంటున్నాను. భర్త, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గణేశ్‌చక్రవర్తి సహకారంతో పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా’ అని నిర్మల్‌ మున్సిపల్‌ కాబోయే చైర్‌పర్సన్‌ అప్పాల కావ్య అన్నారు. 13వ చైర్‌పర్సన్‌గా ఆమె సోమవారం తన పాలకవర్గంతోపాటు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈసందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.

చైర్‌పర్సన్‌గా ఏం చేయాలనుకుంటున్నారు..

ఇటు అత్తగారింట్లో, అలాగే చిన్నప్పుడు అమ్మవాళ్ల వైపూ రాజకీయ నేపథ్యం ఉంది. నేను స్థానికంగానే సరస్వతీ శిశుమందిర్‌లో చదువుకున్నా. ఈనేపథ్యంలో మున్సిపల్‌పైనే కాకుండా సామాజిక అవగాహన కూడా ఉంది. నిర్మల్‌పై పట్టున్న, అలాగే పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో ఉన్న భర్త గణేశ్‌చక్రవర్తి సహకారంతో సమస్యలేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తాను.

ప్రాధాన్యత అంశాలు ఏంటి?

ఏ పాలకవర్గమైనా ముందుగా పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించాలనుకుంటుంది. మా నూతన పాలకవర్గం కూడా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యంపై ప్రధాన దృష్టిపెడతాం. శివారు కాలనీల్లో సమస్యల పరిష్కారానికీ ప్రాధాన్యతనిస్తాం.

సమస్యలను అధిగమిస్తా..

నిర్మల్‌ మున్సిపాలిటీ జిల్లాకేంద్రం కావడంతో ప్రధానంగా ట్రాఫిక్‌, రోడ్లపై దుమ్ము, కొన్ని చోట్ల ఆక్రమణల సమస్యలు ఉన్నాయి. వీటిపై పాలకవర్గంలో చర్చించి, ప్రజామోదమైన చర్యలు చేపడతాం. పట్టణ సుందరీకరణతోపాటు వర్షకాలంలో ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో శాశ్వత చర్యలను చేపడతాం. కోతుల సమస్యకు 2014–19వరకు చేపట్టిన విధంగా పక్కాగా చర్యలు తీసుకుంటాం. పట్టణవాసుల ఆహ్లాదం, పిల్లలకు క్రీడల కోసం పక్కాగా ఏర్పాట్లు చేస్తాం.

పారద్శకమైన సేవలు..

పాలకవర్గం కొలువుదీరిన తర్వాత చర్చించి బ ల్దియా ద్వారా పూర్తి పారదర్శకమైన సేవలు పట్టణ ప్రజలకు అందించేలా చర్యలు చేపడతాం. అధికారులు, సిబ్బంది ప్రజలకు అవినీతిరహితంగా, నాణ్యమైన సేవలు అందించేలా చూస్తాం.

బయోడేటా..

పూర్తి పేరు: అప్పాల కావ్య

భర్త పేరు: అప్పాల గణేశ్‌చక్రవర్తి

పిల్లలు: శౌర్యచక్రవర్తి, ఆద్య

వయస్సు: 40 ఏళ్లు

విద్యాభ్యాసం: ఎమ్మెస్సీ

ప్రత్యేకత తీసుకువస్తారా..

రాష్ట్రంలో మా కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధి కారంలో ఉంది. ముందుగా నిర్మల్‌ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతాం. స్వ చ్ఛతతోపాటు సమస్యల్లేని నిర్మల్‌ కోసం కృషిచేస్తాం. ఇందుకు అన్నివర్గాల ప్రజలు బేధాభిప్రాయాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా సహకరించాలి.

తొలి అడుగే చైర్‌పర్సన్‌గా..

రాజకీయాలు నాకు కొత్త కానీ, మా కుటుంబానికి కాదు. నా భర్త అప్పాల గణేశ్‌చక్రవర్తితోపాటు తాత అప్పాల నర్సయ్య, మూడో అత్తమ్మ అప్పాల అనురాధ నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌లుగా చేశారు. రిజర్వేషన్‌ కారణంగా ఇప్పుడు నాకు చైర్‌పర్సన్‌ అయ్యే అవకాశం వచ్చింది. మా కుటుంబానికి నాలుగోసారి చైర్‌పర్సన్‌గా అవకాశం రావడం సంతోషంగా ఉంది. అలాగే ఓ బాధ్యతగానూ భావిస్తున్నా.

నిర్మల్‌ అభివృద్ధిపై విజన్‌1
1/1

నిర్మల్‌ అభివృద్ధిపై విజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement