బస్సు.. ఆటో.. కాలినడక
బడికెళ్లే విద్యార్థు అవస్థల ప్రయాణం ఇలా.. చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం కరువు.. ప్రైవేటుగా ఆటోలు మాట్లాడి పంపుతున్న తల్లిదండ్రులు.. అవీ లేకుంటే కాలినడకే..
తానూరు మండలం ఉమ్రి(కె) గ్రామానికి చెందిన దాదాపు 25 మంది విద్యార్థులు బోరిగాంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు కాలినడకనే వెళ్తుంటారు. దాదాపు 2 కి.మీ. దూరం కాలినడకన పాఠశాలకు చేరుకుంటారు. పాఠశాలకు ఆలస్యమవుతుందని ఒక్కోసారి ఏమీ తినకుండానే వెళ్తామని విద్యార్థులు తెలిపారు.
లోకేశ్వరం మండలం బాగాపూర్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వరకు మాత్రమే ఉంది. రాజురాలో ఉన్నత పాఠశాల ఉండడంతో గ్రామం నుంచి దాదాపు 15–20 మంది విద్యార్థులు రాజురాలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. అయితే గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో డబ్బులు పెట్టుకుని ఆటోలో వెళ్తున్నారు.
భైంసాటౌన్: బస్సులు లేవు.. ఉన్నా వేళకు రావు.. వచ్చినా సీట్లు ఖాళీగా ఉండవు.. మహాలక్ష్మి కారణంగా నిలబడే స్థలం కూడా ఉండడం లేదు. విధిలేక.. డబ్బులు ఉంటే ఆటోలో.. లేకుంటే కాలి నడకే. ఇదీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలక వెళ్లే విద్యార్థుల పరిస్థితి. ఒకప్పుడు సరైనా రోడ్లు లేక మారుమూల గ్రామాలకు బస్సులు నడిపేవారు కాదు. అప్పట్లో బస్సులూ తక్కువే. కానీ రోడ్లు మెరుగయ్యాయి. బస్సుల సంఖ్య పెరిగింది. కానీ ఇప్పటికీ జిల్లాలో చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటుగా ఆటోలను మాట్లాడి బడికి పంపిస్తున్నారు. కొన్నిసార్లు ఆటోల్లోనూ పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుని వెళ్లూ ప్రమాదాల బారిన పడిన సందర్భాలూ ఉన్నాయి. ఇంత చేసినా.. సకాలంలో బడికి వెళ్తామన్న భరోసా లేదు.
జిల్లాలో ఇలా...
జిల్లాలో నిర్మల్, భైంసా ఆర్టీసీ డిపోలు ఉండగా, దా దాపు అన్ని మండలకేంద్రాలకు బస్సులు నడుపుతున్నారు. అయితే, కొన్ని మారుమూల గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. రహదారులు సరిగ్గా లేవన్న కారణంతో ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు బడికి వెళ్లేందుకు ఆ టోలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల ఆటోలూ లేక కాలి నడకనే వెళ్తున్నారు. ఇంకా కొన్ని రూట్లలో బస్సులు ఉన్నా.. పాఠశాల విద్యార్థులు రాకపోకలు సాగించే ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులన్నీ ప్రయాణికులతో ఫుల్‌గా ఉంటున్నాయి. దీంతో కొ న్నిసార్లు డ్రైవర్లు బస్సు నిలపకుండానే వెళ్తున్నారు. ఒక్కోసారి నిలిపినా కూర్చునేందుకు సీటు లేక ని ల్చునే ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు ప్రయాణికుల రద్దీ మధ్య ఇబ్బందికరంగా ప్రయాణిస్తున్నారు. బస్సులు సైతం సకాలంలో రాక, సాయంత్రం ఇళ్లకు ఆలస్యంగా చేరుకుంటున్నారు.
అన్ని రూట్లలో బస్సులు...
దాదాపు అన్నిరూట్లలో ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాం. విద్యార్థుల కోసం ఇంకా అదనంగా గ్రామాలకు సర్వీసులు నడిపిస్తున్నాం. కొన్ని గ్రామాలకు మాత్రం ముందు నుంచి బస్సులు నడపడం లేదు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పాఠశాల సమయాల్లో నడుపుతున్నాం.
– హరిప్రసాద్, డీఎం, భైంసా
బస్సు.. ఆటో.. కాలినడక
బస్సు.. ఆటో.. కాలినడక
బస్సు.. ఆటో.. కాలినడక


