‘పది’ విద్యార్థులకు ‘సాక్షి’ మెటీరియల్
లక్ష్మణచాంద: గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సరైనా స్టడీ మెటీరియల్ లేక ఇబ్బంది పడుతుంటారు. పదో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఉత్తమ స్టడీ మెటీరియల్ అందించాలని ‘సాక్షి’ యాజమాన్యం సంకల్పించింది. ఈమేరకు సోన్ మండలం న్యూవెల్మల్–బొప్పారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 57 మంది విద్యార్థులకు గణితం, భౌతికశాస్త్రం స్టడీ మెటీరియల్‌ను గురువారం ఉచితంగా అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యాసాగర్ మెటీరియల్ బాగుందని పది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ విద్యార్థులకు అందించిన సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో వీడీసీ అధ్యక్షుడు వేణు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


