వారసత్వ ఉత్సవం
రాజుల కాలంలోనూ పుర సంబురాలు
నిర్మల్: నిర్మల్ జిల్లా తన చరిత్రలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వేదవ్యాసుడు చదువులమ్మకు పురుడు పోసిన బాసర, బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసిన భావరి నివసించిన బాదన్‌కుర్తి నుంచి ఈ ప్రాంతం విలసిల్లింది. ఓరుగల్లు, గోల్కొండలా అభేద్య కోటలు, ప్రథమ భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ఖిల్లాలు ఇక్కడి సంపద. నాటి ఉత్సవాల సంప్రదాయాన్ని పునరుజ్జీవనం చేస్తూ కలెక్టర్ అభిలాష అభినవ్ గతేడాది ప్రారంభించిన ‘నిర్మల్ ఉత్సవాలు’ ఐదు రోజుల వేడుకగా సంబరాలు సృష్టిస్తున్నాయి.
చరిత్ర పునరుద్ధరణ..
కోటలు, కొయ్యబొమ్మలు మాత్రమే కాదు, రాంజీసహా నేతృత్వంలో వెయ్యి మంది అమరుల త్యాగాలు నిర్మల్ గుర్తింపు. పక్క జిల్లాల్లో కూడా ఈ చరిత్ర తక్కువ తెలిసినప్పటికీ, పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. ఓరుగల్లు, ఎలగందల్, భువనగిరి లాంటి గుర్తింపు జిల్లాకు రావాలని డిమాండ్. ఉత్సవాల్లో చరిత్రకారులు, అధ్యాపకులు రోజూ ఈ గాధలను వివరిస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు.ధుత్సవాలు మరో రెండు రోజులు పొడిగించాలని స్థానికులు కోరుతున్నారు.
విజ్ఞానం – వినోదం..
ఉత్సవాలు చరిత్రకు మాత్రమే పరిమితం కాదు. ప్రభుత్వ పాఠశాలల చిన్నారుల నృత్యాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు ఆదరణ పొందుతున్నాయి. వెంగ్వాపేట్ విద్యార్థులు తయారు చేసిన బ్రెస్ట్‌ఫీడింగ్ పిల్లోలు, సహజ సానిటరీ ప్యాడ్‌లు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. సైన్స్ ప్రయోగాలు, జాయింట్ వీల్ ఆటలు, ప్లే జోన్‌లు చిన్నారులను సంతోషపరుస్తున్నాయి. నిర్మ ల్ వంటకాలు, ఇప్పపువ్వు లడ్డూలు అందరూ ఆస్వాదిస్తున్నారు.
వీకెండ్ వరకు పొడిగించాలి
వారం మధ్య ప్రారంభమైన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్ వరకు కొనసాగితే మరింతమంది వస్తారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఉత్సవాలు జిల్లా చరిత్ర ను, సంస్కృతిని ప్రపంచానికి చాటుతూ, యువతకు వారసత్వాన్ని అందిస్తున్నాయి.
వసంతోత్సవం..
నిమ్మల రాజ్యంలో హోలీ వేడుకలు నిర్వహించేవారు. స్థానిక బంగల్‌పేట్ బంగల్‌చెరువు(వినాయకసాగర్) మధ్యలో గల వేదికలాంటి నిర్మాణం నాటి నర్తనశాలనే. హోలీ పండుగకు ముందు ఆరు రోజులు పురప్రజలు వీక్షించేలా నర్తకీమణుల నృత్యాలు, కళాప్రదర్శనలు నిర్వహించేవారు. ఉత్సవాల్లో చివరిరోజు రంగులకేళీగా హోలీ నిర్వహించేవారు.
వారసత్వ ఉత్సవం


