బొజ్జుకు ప్రతిష్టాత్మకమే..
రెండేళ్ల క్రితం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన వెడ్మ బొజ్జుపటేల్ తొలిసారి పంచాయతీ పోరు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే డీసీసీ అధ్యక్షుడు కావడంతో తన సొంత ఇలాఖాలో తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవడం మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో పంచాయతీ ఎన్నికల్లో గెలుపు బాధ్యత తీసుకుని చెమటోడ్చారు. ఓవైపు నేతలను సమన్వయం చేసుకుంటూ డీసీసీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఎమ్మెల్యేగా ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లోని పంచాయతీల్లో ప్రచారం చేశారు. అక్కడక్కడా ఇబ్బందులు, ఆరోపణలు ఎదురైనా.. తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలంటూ కోరారు. అధికార పార్టీ అండ ఉంటే పంచాయతీలు అభివృద్ధి చెందుతాయంటూ విస్తృతంగా ప్రచారం చేశారు.


