బల నిరూపణలో జాన్సన్
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ జిల్లాలో చాలావరకు ఉనికి కో ల్పోయింది. ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్రమే హస్తం పార్టీ కాస్త బలంగా కనిపిస్తోంది. ఇందుకు నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌నాయకే కార ణం. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఈక్రమంలో తొలిసారి ఎదుర్కొంటున్న పంచాయతీ ఎన్నికల్లో శ్రమించారు. గ్రామగ్రామాన, ఇంటింటా తిరిగి, బలనిరూపణకు సిద్ధమయ్యారు. కనీ స స్థానాలైనా తాము బలపర్చిన అభ్యర్థులకు దక్కితే తాము గెలిచినట్లేనని ఆయన చెబుతున్నారు.


