తొలివిడత ఆ ముగ్గురికీ కీలకం
నిర్మల్: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మొ దటి విడతలో ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, పెంబి, మామడ, లక్ష్మణచాంద మండలాలున్నాయి. ఇందులో ఖానాపూర్ నియోజకవర్గం అధికార కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌కూ కీలకం. ఎందుకంటే.. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏకై క కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జుపటేల్ నియోజకవర్గమిది. ఇటీవల నిర్మల్ డీసీసీ పదవి కూడా ఆయనకే దక్కింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్‌దీ ఇదే నియోజకవర్గం. ఇక జిల్లాలో అంతో.. ఇంతో బీఆర్‌ఎస్ ఉందీ అంటే అది ఖానాపూర్ నియోజకవర్గంలోనే. ఈనేపథ్యంలో మూడు పార్టీలకూ తొలివిడత పంచాయతీ పోరు ప్రతిష్టాత్మకంగా మారింది.


