ఉచిత న్యాయ సహాయం అందిస్తాం
భైంసాటౌన్: మానసిక వికలాంగులకు ఉచిత న్యా య సహాయం అందించేందుకు భరోసా కల్పిస్తామ ని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక తెలిపారు. పట్ట ణంలోని నర్సింహ కల్యాణ మండపంలో బుధవా రం స్నేహ సొసైటీ, దివ్యాంగుల సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగులు, మానవ హ క్కుల దినోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ చిన్నారుల నృత్య, గాన ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమానికి రాధిక ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులను అ క్కున చేర్చుకుని చదువు చెప్పించి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని అభినందించారు. మానసిక వికలాంగులను తల్లిదండ్రులు పాఠశాలల్లో చే ర్పించి చదివించాలని సూచించారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్దయ్య మాట్లాడుతూ.. దేశంలో 21రకాల దివ్యాంగులుంటే ఆరు విభాగాలకే వైద్యులున్నారని, మిగతా విభాగాలకూ డాక్టర్లను నియమించాలని కోరారు. సదరం యూడీఐడీ సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కా ర్యక్రమంలో భైంసా సీడీపీవో రాజశ్రీ, సొసైటీ భైంసా అధ్యక్షుడు డాక్టర్ మహిపాల్, కార్యదర్శి సిద్ద య్య, అంధుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సి పాల్ జ్యో తి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, ఐఎంఏ కార్యదర్శి సూర్యకాంత్‌రెడ్డి, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు సచిన్‌రెడ్డి, శివ కాశీనాథ్, నాగ్‌నాథ్ పటేల్, దామోదర్‌రెడ్డి, రామకృష్ణగౌడ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జిల్లా జడ్జి రాధిక


