పెండింగ్ బిల్లులెలా?
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రి య మొదలు కావడంతో తాజా మాజీ సర్పంచుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలోని చాలా గ్రా మాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కొత్త పాలకవర్గం వస్తే తమ బిల్లులు చెల్లింపు మరింత జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బకాయిలు రూ.13.60 కోట్లు
జిల్లాలో పునర్విభజనకు ముందు 396 గ్రామపంచాయతీలుండగా మేజర్ పంచాయతీల్లో ఎక్కు వ, చిన్న పంచాయతీల్లో తక్కువ పనులు జరిగా యి. జిల్లా వ్యాప్తంగా మాజీ సర్పంచులకు బిల్లు ల బకాయిలు దాదాపు రూ.13.60కోట్ల వరకు ఉంటుంది. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో వివి ధ రకాల అభివృద్ధి పనులు చేశారు. ఆ బిల్లులను గ్రామపంచాయతీల ద్వారానే చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఇలా పంచాయతీ ని ధులతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లు బ కాయిలు అలాగే ఉండిపోయాయి. బిల్లుల చెల్లింపుల కోసం మాజీ సర్పంచులు అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా బిల్లు బకాయిల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శించినట్లు విమర్శలున్నాయి.
చెల్లింపులపై స్పష్టత కరువు
ఎన్నికలకు ముందుగానే ఆయా గ్రామపంచాయతీల పరిధిలో ఎంత మొత్తం బకాయిలున్నాయో ప్రభుత్వం అధికారుల ద్వారా వివరాలు సేకరించింది. అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు చేసి బిల్లులను ట్రెజరీలో అందించారు. కొన్ని పనులకు టోకెన్లు జారీ కాగా మరికొన్ని పనులకు ఇవ్వలేదు. ఎలాంటి నిధులు మంజూరైనా పంచాయతీ ఖాతాల్లోకే చేరుతాయి. ఈ నేపథ్యంలో కొత్త పాలకవర్గాలు వాటిని కొత్త పనుల కోసం వినియోగిస్తే తమ పరిస్థితి ఏమిటని దిగులు చెందుతున్నారు. దీనిపై ఎలాంటి స్పష్టత ఇ వ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
గతంలో గ్రామపంచాయతీ అభివృద్ధిలో భాగంగా చేసిన పనుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. నిధులు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. బిల్లుల బకాయిలు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలి.
– వీరేశ్‌యాదవ్, సర్పంచుల సంఘం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు
పెండింగ్ బిల్లులెలా?


