నేడే తొలి సంగ్రామం
న్యూస్‌రీల్
మొదటివిడతలో 136 పంచాయతీలు జిల్లాలో ఇప్పటికే 16జీపీలు ఏకగ్రీవం పెర్కపల్లి మినహా 119చోట్ల ఎన్నికలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు 7నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ 2నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
నిర్మల్
ఇంటి నుంచి ఓటు లేనట్లే..
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నడవలేని వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటేసే సౌకర్యం కల్పించారు. గ్రామపంచా యతీ ఎన్నికల్లో దీనిని విస్మరించారు.
పోలింగ్ ఏర్పాట్ల పరిశీలన
లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బుధవారం పరిశీలించారు. రిటర్నింగ్ ఆఫీసర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి అంబాజీ, ఎంపీడీవో రాధ, తహసీల్దార్ సరిత, డీటీ బాబుసింగ్, ఎంపీవో నసురుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్: పంచాయతీ ఎన్నికల్లో ప్రథమ సంగ్రామానికి వేళయింది. తొలివిడత గ్రామాల్లో ఎన్నికలకు సర్వం సన్నద్ధమైంది. జిల్లాలోని ఆరు మండలాల్లో గురువారం ఉదయం నుంచే ఓట్ల పండుగ ప్రారంభమవుతోంది. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురా బాద్, మామడ, లక్ష్మణచాంద మండలాల్లో 136 జీపీలుండగా 16 ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్లు వేయని దస్తురాబాద్ మండలం పెర్కపల్లి మినహా మిగతా 119 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ విడతలోని సమస్యాత్మక పంచాయతీలతో పాటు మిగతా జీపీల్లోనూ బుధవారం సాయంత్రంలోపే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పో లింగ్ సిబ్బంది కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. యాపల్‌గూడ లాంటి కేంద్రాలకు కడెం నది ని తెప్పపై దాటుతూ సిబ్బంది వెళ్లడం గమనార్హం.
ఉదయం 7గంటల నుంచే పోలింగ్
తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్న ఆరు మండలాల్లో బుధవారం సాయంత్రం వరకే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇక గురువారం ఉద యం 7గంటల నుంచే పోలింగ్ ప్రారంభమవుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. గంట విరామం తర్వాత మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. ఒంటిగంటలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నవారినే ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే పోలీస్ బందోబస్తు మధ్య లెక్కింపు కొనసాగనుంది. వార్డులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఫలితాలు తేలడానికి సమయం కాస్త అటుఇటుగా పట్టనుంది. సాయంత్రం 4గంటల నుంచి పంచాయతీల భవితవ్యం తేలే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీ కెమెరాలూ ఏర్పాటు చేశారు.
మహిళా ఓటర్లే అధికం
తొలివిడత ఎన్నికలు నిర్విహిస్తున్న ఆరు మండలా ల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉ న్నారు. ఈ విడతలో 1,27,245 ఓటర్లలో పురుషులు 60,576, మహిళలు 66,667మంది ఉన్నారు. ఈలెక్కన పురుషుల కంటే 6,091మంది మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఆరు మండలాల్లో కలిపి ఇతరు ల కేటగిరీలో ఇద్దరు ఓటర్లున్నారు. కడెం మండలంలో అధికంగా 29,159మంది ఓటర్లుండగా, అత్య ల్పంగా పెంబిలో 10,886మంది ఓటర్లున్నారు.
తొలి విడత ఎన్నికల వివరాలు
ఎన్నికలు జరిగే మండలాలు 6
మొత్తం ఓటర్లు 1,27,245
మహిళా ఓటర్లు 66,667
పురుష ఓటర్లు 60,576
ఇతరులు 02
మొత్తం పంచాయతీలు 136
ఏకగ్రీవమైన పంచాయతీలు 16
నామినేషన్ వేయని జీపీలు 1
ఎన్నికలు జరిగే జీపీలు 119
పోటీలో ఉన్న అభ్యర్థులు 454
మొత్తం వార్డులు 1,072
ఏకగ్రీవ వార్డులు 474
ఎన్నికలు జరిగే వార్డులు 591
నామినేషన్ వేయని వార్డులు 07
పోటీచేస్తున్న అభ్యర్థులు 1,369
నేడే తొలి సంగ్రామం
నేడే తొలి సంగ్రామం


